ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరువురు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

ABN, First Publish Date - 2022-07-05T05:26:24+05:30

కోల్‌కతా ప్రాంతంలో కోట్లాది రూపాయల ఆన్‌లైన్‌ సైబర్‌ నేరాలకు పాల్పడిన చిట్వేలి ప్రాంతానికి చెందిన ఇరువురిని పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులను తీసుకెళుతున్న కోల్‌కతా పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదుపులోకి తీసుకున్న కోల్‌కతా పోలీసులు

కోట్లల్లో ఆన్‌లైన్‌ దందాకు పాల్పడ్డారని కోల్‌కతాలో కేసు నమోదు 

రాజంపేట, జూలై 4: కోల్‌కతా ప్రాంతంలో కోట్లాది రూపాయల ఆన్‌లైన్‌ సైబర్‌ నేరాలకు పాల్పడిన చిట్వేలి ప్రాంతానికి చెందిన ఇరువురిని పోలీసులు అరెస్టు చేశారు. చిట్వేలి మండలానికి చెందిన ప్రశాంత్‌కుమార్‌, సాయిరామ్‌ అనే వ్యక్తులు కోల్‌కతాలో ఉంటూ కోట్లాది రూపాయల సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అక్కడ ఓ మహిళకు చెందిన అకౌంట్‌ నుంచి రాజంపేట హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు ఏటీఎం ద్వారా డబ్బు డ్రా చేయడానికి ప్రయత్నించి డబ్బులు రాకపోవడంతో వారు ఏటీఎం కార్డు వ్యవహారంపై సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించారు. బ్యాంకు వారికి అనుమానం రావడంతో వారు వెంటనే రాజంపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పట్టణ పోలీసులు వారిరువురిని అదుపులోకి తీసుకుని కోల్‌కతా పోలీసులకు సమాచారం అందించారు. కోల్‌కతా ప్రాంతానికి చెందిన సీఐ దులాల్‌సహారాయ్‌ నిందితులను అదుపులోకి తీసుకుని కోల్‌కతాకు తీసుకెళ్లారు. ఈ విషయంపై పట్టణ సీఐ నరసింహులును వివరణ కోరగా నిందితులను కోల్‌కతా పోలీసులు తీసుకెళ్లారని వారి విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. 

Updated Date - 2022-07-05T05:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising