ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ రాష్ట్రపతి వీవీ గిరికి నివాళులు

ABN, First Publish Date - 2022-08-11T04:38:28+05:30

మాజీ రాష్ట్రపతి వీవీగిరి దేశానికి విశిష్ట సేవలందించారని ఎస్పీ అన్బురాజన్‌ కొనియాడారు.

వీవీ గిరికి నివాళులర్పిస్తున్న ఎస్పీ - లింగాలలో విద్యార్థుల మానవహారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(క్రైం), ఆగస్టు 10: మాజీ రాష్ట్రపతి వీవీగిరి దేశానికి విశిష్ట సేవలందించారని ఎస్పీ అన్బురాజన్‌ కొనియాడారు. ఆజాదికా అమృత్‌మహోత్సవ్‌లో భాగంగా జిల్లా పోలీ స్‌ కార్యాలయంలో నిర్వహించిన వీవీగిరి 128వ జయంతిలో ఎస్పీ మాట్లాడుతూ అనిబీసెంట్‌ ప్రారంభించిన హోమ్‌ రూరల్‌ ఉద్యమం అనంతరం క్విట్‌ ఇండియా ఉద్యమం లో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఉత్తరప్రదేశ్‌, కేరళ, మైసూర్‌  రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారన్నారు. బ్యాంకుల జాతీయీకరణలో వీవీగిరి ప్రముఖ పాత్ర పోషించారన్నారు. వీవీగిరిని స్ఫూర్తిగా తీసుకుని పోలీసు సిబ్బంది విధుల్లో అంకితభావంతో నిర్వర్తించి ప్రజల మన్ననలు అందుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, ఆర్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 

మొక్కలు పంపిణీ

 కడప(కలెక్టరేట్‌) ఆగస్టు 10: ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌  సొసైటీ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి, రెడ్‌ క్రాస్‌ సొసైటీ స్పెషల్‌ అధికారి కుళ్లాయప్ప ఆదేశాల మేరకు మొక్కలు పంపిణీ చేశారు. ఆజాదికా అమృత్‌లో భాగంగా  ప్రభుత్వ మ హిళా డిగ్రీకళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్‌ పి. వెంకట సుబ్బలక్ష్ముమ్మ మొక్కలు నాటారు.  ఎన్‌ఎ్‌సఎ్‌స కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ విజయలక్ష్మీ, గురుమోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో....

వేంపల్లె, ఆగస్టు 10: ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ రాష్ట్రపతి వీవీ గిరికి నివాళులర్పించారు.  కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ కోటేశ్వరి, పరిపాలన అధికారి జిలాని, ప్రో గ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రమేష్‌, అనూషరాజ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో క్విజ్‌ పోటీలు

 స్థానిక వైఎస్‌ఆర్‌ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆజాదీకా అమృత్‌ మహో త్సవ్‌లో భాగంగా క్విజ్‌ పోటీలు నిర్వహించా రు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యోగాంజనేయులు మాట్లాడుతూ ఆన్‌లైన్‌ క్విజ్‌లో 45 మంది పాల్గొన్నారన్నారు. విజేతలకు స్వాతంత్య్ర ది నోత్సవం రోజు బహుమతులు అంది స్తామ న్నారు. కంప్యూటర్‌ విభాగ అధ్యాపకురాలు నీలా కిరణ్మయి, షఫీవుద్దీన్‌ పాల్గొన్నారు.

లింగాలలో ర్యాలీ

లింగాల, ఆగస్టు 10: జడ్పీ హైస్కూల్లో  మ హనీయుల త్యాగ ఫలాలను గుర్తుచే సుకుం టూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరే యాలని ఎంపీపీ అమృత, తహసీల్దార్‌ శేషా రెడ్డి, ఎంపీడీఓ సురేంద్రనాథ్‌, ఎంఈఓ నారా యణరెడ్డి, ఏపీఎం ఆంజనేయులు అన్నారు. అనంతరం పాఠశాల నుంచి జాతీయ జెండా చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. బ స్టాండ్‌లో మానవహారం నిర్వహించారు.  

Updated Date - 2022-08-11T04:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising