ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరజీవికి ఘన నివాళి

ABN, First Publish Date - 2022-12-15T23:48:36+05:30

పట్టణంలో గురువారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి వేడుకలు నిర్వహించారు. జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, వైస్‌చైర్మన్‌ హరిరవిలు పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సిద్దవటంలో.. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న అసిస్టెంట్‌ కమాండెంట్‌ కేశవరెడ్డి,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, డిసెంబరు 15: పట్టణంలో గురువారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి వేడుకలు నిర్వహించారు. జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, వైస్‌చైర్మన్‌ హరిరవిలు పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు శివానందగౌడ్‌, ఆర్యవైశ్య నాయకులు అల్లం అశోక్‌కుమార్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు పెంచలయ్య, న్యామతుల్లా, లక్ష్మినారాయణ, పెంచలయ్య, మహిళా నాయకురాలు సురేఖ, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో...

పట్టణంలో టీడీపీ నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌, రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి ప్రతా్‌పరాజు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరులో...

అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా గురువారం రైల్వేకోడూరులో ఆయన విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేశ్‌ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అదేవిధంగా వాసవి క్లబ్‌ అధ్యక్షుడు పొన్నూరు నిరంజన్‌బాబు, మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పార్థసారథి, జిల్లా వాసవి క్లబ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ పెండ్యాల విజయ్‌కుమార్‌, జిల్లా కో-ఆర్డినేటర్‌ గునిశెట్టి సాయి, క్లబ్‌ కోశాధికారి వేమా వెంకట కిషోర్‌బాబు, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి కుమార్‌, పెసల తిరుపాలు, క్లబ్‌ సభ్యులు నివాళి అర్పించారు. స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళి అర్పించారు.

సిద్దవటంలో...

మండలంలోని భాకరాపేట 11వ పోలీస్‌ బెటాలియన్‌లో గురువారం కమాండెంట్‌ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ కమాండెంట్‌ వి.కేశవరెడ్డి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, మినిస్టీరియల్‌ స్టాఫ్‌, సిబ్బంది పాలల్గొన్నారు.

పుల్లంపేటలో...

పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని ప్రధానోపాధ్యాయుడు రెడ్డిప్రసాద్‌ పేర్కొన్నారు. గురువారం పిటిజీపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో అమరజీవి వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివశంకర్‌రాజు, గంగనపల్లె వెంకటరమణ, సుజాత, భారతి, గౌరిదేవి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising