ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాజ్‌వే పై ప్రయాణం.. ప్రమాదకరం

ABN, First Publish Date - 2022-07-02T04:50:33+05:30

బి.కొత్తకోట నుంచి బెంగళూరుకు వెళ్లే రోడ్‌లో ఉన్న కాజ్‌వే దెబ్బతినడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

దుస్థితిలో ఉన్న కాజ్‌వేపై నిలిచిపోయిన వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బి.కొత్తకోట జూలై 1 : బి.కొత్తకోట నుంచి బెంగళూరుకు వెళ్లే రోడ్‌లో ఉన్న కాజ్‌వే దెబ్బతినడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాహన దారులు ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఇక అంతే..కనీసం కాజ్‌వేకు ఇరువైపులా రక్షణ గోడ లేకపోవడం మరోవైపు వంతెన బాగా దెబ్బతిన డంతో భారీ వాహనం ఒకటి వచ్చినా అతి జాగ్రత్తగా వెళ్లాల్సిందే. కొన్ని సందర్భాలలో చిన్న వాహనాలు రెండు ఒకేసారి వస్తే ట్రాఫిక్‌ స్తంభించి పోయి ఇబ్బందులు కలుగుతున్నాయి. మండలంలోని కంబాల్లపల్లె సమీపంలోని బీరంగి ఏటిపై గల కాజ్‌వే దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోని కాజ్‌వే గత నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల రాళ్లు తేలి గుంతలు పడడంతో రాక పోకలు అతి కష్టం మీద సాగుతున్నాయి. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణాలు సాగించాల్సి వస్తోందని ప్రయాణికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచు వాహనాలు ఈ కాజ్‌వేపై ఇరుక్కు పోవడం ట్రాపిక్‌ స్థంబించి పోవడం జరుగుతోంది. శుక్రవారం ఉదయవ ఓటెంపో వాహనం ఈ కాజ్‌వేపై వస్తుండగా యాక్సిల్‌ కట్‌ అయి రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అసలే రోడ్డు అధ్వాన పరిస్థితులలో ఉండడం ఆపై వాహనం మధ్యలో ఇరుక్కు పోవడంతో దాదాపు గంట పాటు ట్రాపిక్‌ స్తంభించి పోయింది. దెబ్బతిన్న కాజ్‌వేను బాగు చేయాలని పలు మార్లు రోడ్లు, భవనాల శాఖ అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి బీరంగి ఏరు ప్రవాహం అధికంగా వస్తే ఉన్న కాజ్‌వే కొట్టుకు పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూన కాజ్‌వే నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-07-02T04:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising