ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుంజుకున్న టమోటా

ABN, First Publish Date - 2022-09-26T04:53:55+05:30

కలకడ టమోటా మార్కెట్‌లో పది రోజులుగా ఊగిసలాడుతున్న టమోటా ధర ఆదివారం కాస్తా పుంజుకుంది.

కలకడ మార్కెట్‌లో రవాణాకు సిద్ధమవుతున్న టమోటాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15 కిలోలు రూ.470


కలకడ, సెప్టెంబరు 25: కలకడ టమోటా మార్కెట్‌లో పది రోజులుగా ఊగిసలాడుతున్న టమోటా ధర ఆదివారం కాస్తా పుంజుకుంది. పది రోజుల క్రితం రూ.600 ఉన్న 15 కిలోల క్రేట్‌ ధర రోజు రోజుకు పతనమై రూ.200-300లకు చేరుకొంది. స్థానికంగా పంట ఉత్పత్తి పెరగడంతో పాటు సమీప మండలాల నుంచి మార్కెట్‌కు టమోటాలు వెల్లువెత్తాయి. అంతేకాక గత 15 రోజులుగా ఎండలు పెరిగి తోటలోని కాయలు తొందరగా వర్ణానికి వచ్చి ఉత్పత్తి ఎక్కువైంది. ఈ దశలో రైతులు ఆందోళన చెందారు. అయితే ఆదివారం మార్కెట్‌లో 15 కిలోల క్రేట్‌ ధర రూ.470 పలికింది. ఈ వంతున రైతుకు కిలోకు రూ.30 గిట్టుబాటు అవుతుంది. ఈ సీజన్‌లో మార్కెట్‌లో రోజుకు 15 వేల క్రేట్‌లు వచ్చి చేరతాయి. ఈ సరుకును వ్యాపారులు కోల్‌కతా, ఢిల్లీ, రాజస్థాన్‌, చెన్నై, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. 

Updated Date - 2022-09-26T04:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising