ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలాల్లోనే.. టమోటా

ABN, First Publish Date - 2022-08-08T04:41:54+05:30

ధరల లేమి ఒక వైపు, వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో వైపు టమోట రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. టమోట సాగు చేసి న ప్రతి రైతు దాదాపు రూ.లక్ష న్నర నుంచి పది లక్షల దాక పె ట్టుబడులు పెట్టి నష్టపోయారు. ఒక ఎకరం పంట సాగు చేయా లంటే రూ.లక్షన్నర నుంచి రూ.రెం డు లక్షల దాక పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఒక ఎకరం సాగు చేసిన రైతు రూ.లక్షన్నరకు పైగా నష్టపోయాడు. 5 ఎకరాలు సాగు చేసిన రైతు రూ.10 లక్షల దాక నష్టపోయాడు. ఇలా అన్నమ య్య, చిత్తూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేసిన వేలాది మంది రైతులకు కోట్లాది రూపా యలు నష్టం వాటిల్లింది.

బి.కొత్తకోట మండలం బడికాయలపల్లె సమీపంలో పొలాల్లోనే కోత కోయకుండా వదిలేసిన టమోట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పతనమైన ధరలు   

రైతన్నలకు భారీ నష్టం 

బి.కొత్తకోట, ఆగస్టు 7: ధరల లేమి ఒక వైపు, వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో వైపు టమోట రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. టమోట సాగు చేసి న ప్రతి రైతు దాదాపు రూ.లక్ష న్నర నుంచి పది లక్షల దాక పె ట్టుబడులు పెట్టి నష్టపోయారు. ఒక ఎకరం పంట సాగు చేయా లంటే రూ.లక్షన్నర నుంచి రూ.రెం డు లక్షల దాక పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఒక ఎకరం సాగు చేసిన రైతు రూ.లక్షన్నరకు పైగా నష్టపోయాడు. 5 ఎకరాలు సాగు చేసిన రైతు రూ.10 లక్షల దాక నష్టపోయాడు. ఇలా అన్నమ య్య, చిత్తూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేసిన వేలాది మంది రైతులకు కోట్లాది రూపా యలు నష్టం వాటిల్లింది. పంట సాగుచేసి అమ్ముకొందామంటే ధరలు లేక కోత కోయడం కూడా వదిలేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉన్న పంట కూడా నేల పాలవుతోందని రైతులు ఆవేదన చెందు తున్నారు. ఎంతో ఆశతో సాగు చేసిన పంట కళ్ల ముందే నేల పాలవుతోం ది. వర్షపు నీటితో టమోట తోటలు తడిసి ముద్దవు తున్నాయి. మొక్కల్లోని ఆకులు కుళ్లిపోయి నల్లగా మారుతున్నాయి. మే, జూన్‌ మాసాల్లో టమోట ధరలు భారీగా పలకడంతో పలువురు రైతులు ఎంతో ఆశతో రూ.లక్షల పెట్టుబడులు పెట్టి పంటలను సాగు చేశారు. అయితే జూలై నెల నుంచి ధరలు పతనమయ్యాయి. దీంతో ప్రస్తుతం చేతికొచ్చిన పంట గిట్టుబాటు ధరలు లేక కనీసం కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేశారు. ఉన్న పంట సైతం వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి పూర్తిగా దెబ్బతింది. ధరల లేమి, వర్షాల కారణంగా పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-08T04:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising