ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెగుళ్లతో టమోటా రైతు విలవిల

ABN, First Publish Date - 2022-08-12T05:15:39+05:30

ఒకవైపు గిట్టుబాటు ధరలేక.. మరోవైపు బాగా ఉన్న పంటకు తెగుళ్ల రాకతో టమోటా సాగుచేసిన రైతులు విలవిల్లాడు తున్నారు.

గుర్రంకొండ మండలంలో రైతులు సాగు చేసిన టమోటా పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్రంకొండ, ఆగస్టు 11: ఒకవైపు గిట్టుబాటు ధరలేక.. మరోవైపు బాగా ఉన్న పంటకు తెగుళ్ల రాకతో టమోటా సాగుచేసిన రైతులు విలవిల్లాడు తున్నారు. ఇలా అయితే చేసిన అప్పులు ఎలా తీరుతాయంటూ అన్నదా తలు ఆందోళనలో పడ్డారు. టమోటా పంటకు కొత్త తెగుళ్లు సోకడంతో  పంట పూత దశలోనే పూర్తిగా దెబ్బతింటోంది. దీంతో టమోటా పంట దిగుబడి రాకనే రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యానవన పం టల సాగులో రైతన్నలకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అధికారులు అటు వైపు కూడా చూడడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుర్రంకొండ మండలంలో రైతన్నలు ఎక్కువగా టమోటా పంటను సాగు చేస్తారు. ఈ క్రమంలో మండలంలో సుమారు 2 వేల ఎకరాలలో రైతులు టమోటా పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంట చాలా వరకు పూత, పిందె దశలో ఉంది. అయితే టమోటా పంటకు జెమిని వైరస్‌ సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్‌ పంటకు సోకడంతో టమోటా మొక్కల ఆకులు ముడతలు వచ్చి, పిందెలు రాలి పోతున్నాయి. దీంతో పంటను రక్షించుకోవడానికి రైతులు వేలాది రూపా యలు ఖర్చు చేసి క్రిమిసంహారక మందులను పిచికారి చేయాల్సివస్తోం దని అయినప్పటికీ తెగుళ్లు అదుపు కావడం లేదని వాపోతున్నారు. టమోటా పంటను వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో టమోటా రైతులకు తెగుళ్లు, దిగు బడిపై అవగాహన కల్పించాల్సిన ఉద్యానవన శాఖ అధికారులు జాడ లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


టమోటా పంట తెగుళ్లపై అవగాహన కల్పిస్తాం

 టమోటా పంటకు సోకి తెగుళ్లపై రైతన్నలకు అవగాహన కల్పించి పంట నష్టపోకుండా చూస్తామని ద్యానవన శాఖ అధికారిణి లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. టమోటా తెగుళ్లపై ‘ఆంధ్రజ్యోతి’ ఉద్యానవన శాఖ అధికారి ణి వివరణ కోరగా పై విధంగా స్పందించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి తెగుళ్లకు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు తెలియజేస్తా మన్నారు. 



Updated Date - 2022-08-12T05:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising