ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు దొంగలు అరెస్టు

ABN, First Publish Date - 2022-03-17T04:46:20+05:30

జిల్లాలోని పలు ప్రాంతా ల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ము ఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.9.40 లక్షల విలువ చేసే బంగారు ఆ భరణాలు, నగదు, వాహనాలను రికవరీ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ ఎస్‌.ఆర్‌. వంశీధర్‌గౌడ్‌ తెలిపారు.

వివరాలు తెలుపుతున్న డీఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగదు, బంగారు నగలు స్వాధీనం    

బద్వేలు, మార్చి 16: జిల్లాలోని పలు ప్రాంతా ల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ము ఠాను అరెస్టు చేసి  వారి నుంచి రూ.9.40 లక్షల విలువ చేసే బంగారు ఆ భరణాలు, నగదు, వాహనాలను రికవరీ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ ఎస్‌.ఆర్‌. వంశీధర్‌గౌడ్‌ తెలిపారు. బుధవారం స్థానిక పోలీసుస్టేషన్‌ ఆవరణలో అర్బన్‌ సీఐ కె.రామచంద్రతో కలిసి డీఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన మీదూరి సునీల్‌, కోర అజయ్‌కుమార్‌, రామిశెట్టి పవన్‌కళ్యాణ్‌ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.25 లక్షల విలువైన 45 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.80 వేలు విలువ చేసే మోటారుసైకిల్‌, రూ.5 లక్షల విలువ చేసే కారు, 1.35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని పట్టుకోవడంలో ప్రత్యేక చొరవ చూపిన అర్బన్‌ సీఐ రామచంద్ర, అర్బన్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీకాంత్‌, వెంకటరమణలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మైదుకూరు సబ్‌ డివిజన్‌ క్రైం పార్టీ ఏఎ్‌సఐ భూపాల్‌రెడ్డి, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T04:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising