ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకులను విమర్శించే అర్హత వారికి లేదు

ABN, First Publish Date - 2022-01-28T05:04:29+05:30

టీడీపీ నాయకులు, ఎమ్మెల్సీ దేవగుడి శివనాథరెడ్డిని విమర్శించే అర్హత వైసీపీ నా యకుడు భరత్‌రెడ్డి, కౌన్సిలర్‌ ముల్లా జానీలకు లేదని టీడీపీ నాయకుడు, దేవగుడి యూత్‌ నాయకుడు నాగేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం

విలేకరులతో మాట్లాడుతున్న నాగేశ్వరరెడి ్డ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.10లకు నీళ్ల క్యాన్‌ విక్రయించడం దోపిడీ కాదా..?

టీడీపీ నాయకుడు, దేవగుడి యూత్‌ నాయకుడు నాగేశ్వరరెడ్డి 

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 27: టీడీపీ నాయకులు, ఎమ్మెల్సీ దేవగుడి శివనాథరెడ్డిని విమర్శించే అర్హత వైసీపీ నా యకుడు భరత్‌రెడ్డి, కౌన్సిలర్‌ ముల్లా జానీలకు లేదని టీడీపీ నాయకుడు, దేవగుడి యూత్‌ నాయకుడు నాగేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం సాయంత్రం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు తక్కువ ధరకు నీరు అందించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి హయాంలో జమ్మలమడుగులో వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేస్తే వైసీపీ అధికారంలోకి రాగానే నీళ్ల క్యాన్‌ రూ.10 విక్రయించడం దోపిడీ కాదా అని ప్రశ్నించారు. పెన్నానది పరిసర ప్రాం తాల్లో ఇసుక ఎడ్ల బండ్లకు రూ.100 ముక్కుపిండి బెదిరించి వసూలు చేసేది వాస్తవం కాదా అన్నారు. జమ్మలమడుగు పట్టణంలో, గ్రామాల్లో ఎక్కడా రోడ్లు వేయకున్నా రెండు చోట్ల రోడ్డు వేసి అభివృద్ధి అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పట్టణంలో గడపగడపకు తిరుగుతున్న వైసీపీ నాయకులు ప్రజలు అడిగిన సమస్యలను పరిష్కరించలేకపోతున్నారన్నారు. ఇప్పటికైనా విమర్శించడం మానుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్‌రాయల్‌, నవనీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising