ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో ఇసుక సమస్య ఉండొద్దు

ABN, First Publish Date - 2022-05-19T06:00:26+05:30

జిల్లాలో ఇసుక సమస్యలు లేకుండా అవసరం మేరకు నిల్వ చేసుకోవాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో గనులశాఖ అధికారులతో ఇసుక అంశంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి ఇసుక సమస్యలు లేకుండా అవసరం మేరకు స్టాకు పాయింట్లలో నిల్వ ఉంచుకోవాలన్నారు.

అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవసరం మేరకే స్టాక్‌ పాయింట్‌లో నిల్వ : కలెక్టర్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), మే 18: జిల్లాలో ఇసుక సమస్యలు లేకుండా అవసరం మేరకు నిల్వ చేసుకోవాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో గనులశాఖ అధికారులతో ఇసుక అంశంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి ఇసుక సమస్యలు లేకుండా అవసరం మేరకు స్టాకు పాయింట్లలో నిల్వ ఉంచుకోవాలన్నారు. వారం రోజుల్లో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పోతపోలు, అంగళ్లు, పీలేరుల్లో కొత్త ఇసుక స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఇసుక స్టాక్‌ పాయింట్‌లో ఒక హౌసింగ్‌ ఏఈని ఏర్పాటు చేసి స్టాక్‌ పాయింట్లకు ప్రతిరోజు ఎంత ఇసుక వస్తోం దనే వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా లో ఎక్కడా ఇసుక అక్రమ నిల్వలు ఉండరాదని, అలా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, మైన్స్‌ డీడీ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం 13 ఇసుక రీచ్‌లు ఉన్నాయని, జిల్లాలోని అన్ని స్టాక్‌ పాయింట్లలో 6,61,713 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ ఉందని కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో చిత్తూరు, కడప మైన్స్‌ డీడీలు ప్రసాద్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, హౌసింగ్‌ జిల్లా అధికారి సాంబశివయ్య, జేపీ గ్రూప్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T06:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising