ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి
ABN, First Publish Date - 2022-02-23T05:06:02+05:30
జిల్లాలోని ప్రాధాన్యత ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ పను లు వేగవంతం చేయాలని కలెక్టర్ విజయరామరాజు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించా రు.
అధికారుల సమీక్షలో కలెక్టర్ విజయరామరాజు
కడప (కలెక్టరేట్) ఫిబ్రవరి 22 : జిల్లాలోని ప్రాధాన్యత ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ పను లు వేగవంతం చేయాలని కలెక్టర్ విజయరామరాజు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించా రు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో భూసేకరణకు సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో జేసీ ఎం.గౌతమి, జీఎన్‌ఎ్‌సఎ్‌స ప్రత్యేక కలెక్టర్ రామమోహన్, ఆయా ప్రాజెక్టులకు చెందిన భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజోలి, జీఎన్‌ఎ్‌సఎ్‌స-హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎత్తిపోతల పథకం, కుందూ, ఎ్‌సఆర్‌ఎస్-1 ఎత్తిపోతల పథకం, శ్రీనివాసపురం రిజర్యాయర్లు తదితర ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలన్నారు. జిల్లా రైతాంగానికి ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ పనులను ఎక్కడా పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు ఏ దశలో ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ, నిర్మాణ పనుల్లో ఏవైౖనా ఇబ్బందులుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వెంటనే పరిష్కరించడం ద్వారా జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించే వీలుంటుందని వెంటనే పనులు పూర్తి చేయాలనీ ఆదేశించారు.
డీఆర్‌సీ సమావేశం రద్దు
అనివార్య కారణాల వల్ల ఈనెల 23వ తేదీ బుధవారం నిర్వహించాల్సి డీఆర్సీ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి బుధవారం డీఆర్సీ సమావేశానికి హాజరు కావద్దని తెలిపారు.
Updated Date - 2022-02-23T05:06:02+05:30 IST