ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిఘా వ్యవస్థ మరింత పటిష్టం

ABN, First Publish Date - 2022-10-18T04:30:24+05:30

రాయచోటి పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు నేరాల కట్టడికి నిఘా వ్యవస్థ మరింత పటిష్టం చేయడం కోసమే కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు.

రాయచోటిలో కమాండ్‌ కంట్రోల్‌ రూంను ప్రారంభిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభోత్సవంలో ఎస్పీ


రాయచోటి టౌన్‌, అక్టోబరు 17: రాయచోటి పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు నేరాల కట్టడికి నిఘా వ్యవస్థ మరింత పటిష్టం చేయడం కోసమే కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. సోమవారం రాయచోటి పట్టణంలోని అర్బన్‌ పోలీస్‌ కార్యాలయంలో కమాండ్‌  కంట్రోల్‌ రూమ్‌, ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌ను ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఆయన అదనపు ఎస్పీ రాజ్‌కమల్‌, డీఎస్పీ శ్రీధరలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాయచోటి పట్టణ పరిధిలో నేరాలను అరికట్టేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. ప్రధానంగా ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు అల్లరి మూకల ఆగడాలను అరికట్టేందుకు ప్రధాన కూడళ్లతో పటు పాఠశాలలు, కళాశాలల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా నూతనంగా ఏర్పడినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో 900కుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మదనపల్లె, రాయచోటి పట్టణాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. భార్యాభర్తల మధ్య ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్స్‌ పనిచేస్తాయన్నారు. నేరాలు, ప్రమాదాలు అరికట్టడంలో భాగంగా రాయచోటి పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిరంతరం కృషి చేసిన డీఎస్పీ శ్రీధర్‌, పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డిలను ఎస్పీ అభినందించారు. అలాగే సీసీ కెమెరాలను అమర్చడంలో కష్టపడి పనిచేయడమే కాకుండా విశేష పనితీరును కనబరచిన కానిస్టేబుల్‌ రాఘవేంద్రబాబుతో పాటు అతడి టీం సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 


బాధితులకు న్యాయం చేయండి : ఎస్పీ 

ప్రజా ఫిర్యాదులపై సత్వరం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎస్పీ బాధితులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నిర్ధిష్ట గడువులోపు స్పందన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోతే సంబంధిత పోలీస్‌ అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి స్పందన కార్యక్రమానికి వచ్చిన 62 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ వాటిని పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-10-18T04:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising