ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైనికుల సేవలు వెలకట్టలేనివి

ABN, First Publish Date - 2022-12-07T23:25:29+05:30

దేశ రక్షణ కు సైనికులు చేస్తున్న సే వ వెలకట్టలేనిదని అన్న మయ్య జిల్లా కలెక్టర్‌ గిరీ షా అన్నారు. జిల్లాలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ స భ్యులకు ఆయన సాయు ధ దళాల పతాక దినోత్స వ శుభాకాంక్షలు తెలిపారు.

విరాళం అందజేస్తున్న కలెక్టర్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు ఇవ్వాలి : కలెక్టర్‌

రాయచోటి (కలెక్టరేట్‌), డిసెంబరు 7: దేశ రక్షణ కు సైనికులు చేస్తున్న సే వ వెలకట్టలేనిదని అన్న మయ్య జిల్లా కలెక్టర్‌ గిరీ షా అన్నారు. జిల్లాలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ స భ్యులకు ఆయన సాయు ధ దళాల పతాక దినోత్స వ శుభాకాంక్షలు తెలిపారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాయుధ నిధి విరాళాల సేకరణను కలెక్టర్‌ ప్రారంభించారు. తనవంతు బాధ్యతగా విరాళం అందజేసిన కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ రక్షణకు సైనికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. భారత సైనిక దళాలు, మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాలపై దేశం గర్విస్తోందన్నారు.

యుద్ధ సమయాల్లో ఎందరో సైనికులు ప్రాణా లర్పించారన్నారు. వీర జవాన్లకు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. జిల్లా సైనిక్‌ సంక్షేమ శాఖ అధికారి ఐజే రఘురామయ్య, సూ పరింటెండెంట్‌ ప్రమోద, మాజీ సైనికుల అసోసియేషన్‌ ప్రతినిధి దిలీ్‌పరెడ్డి, మాజీ సైనికులు, ఎన్‌సీసీసీ‘సి’ ఆఫీసర్‌, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising