ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక మాఫియాను అరికట్టాలి

ABN, First Publish Date - 2022-01-04T04:50:50+05:30

ఇసుక మాఫియాను అరికట్టి పేద ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

రైల్వేకోడూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్ష నిర్వహిస్తున్న సిఐటియు సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు రూరల్‌, జనవరి 3: ఇసుక మాఫియాను అరికట్టి పేద ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఇసుక దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ రెండున్నర సంవత్సరాల నుంచి ఇసుక పేద ప్రజలకు అందుబాటులో లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక నడిరోడ్డు మీద పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు 10వేల రూపాయిలు ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. ఉచితంగా ఇసుక సరఫరా చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పందికాళ్ళ మణి, గిరిజన సంఘం నేత  శివయ్య, సీపీఎం నాయకలు యానాదయ్య, కేవీపీఎస్‌ డివిజన్‌ కన్వీనర్‌ పెంచలయ్య, సీఐటీయూ మండల కన్వీనర్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి


రాజంపేట, జనవరి 3 : రాజంపేటలో ఇసుక మాఫియాను అరికట్టి,  క్వారీలను పునఃరుద్ధరించి భవన నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను సరఫరా చేయాలని ఏపీ బిల్డింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మకు వినతిపత్రం అందజేశారు. రాజంపేటలో ఇసుక కొర తపై ఏఐటీయూసీ అనుబంధం జిల్లా సమితి ఆధ్వర్యంలో మద్దిలేటితో పాటు జిల్లా సెక్రటరీ గాలి చంద్ర, ఖాజా తదితరులు జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. రాజంపేటలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయని, కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇసుక మాఫియావారు ఒక్కో ట్రక్‌ ఇసుకను వేలాది రూపాయలకు అమ్ముకుంటూ భారీ ఎత్తున అక్రమ సంపాదన చేస్తున్నారని ఆరోపించారు.


 

Updated Date - 2022-01-04T04:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising