ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయలసీమ కర్మ కోసమే గర్జన

ABN, First Publish Date - 2022-12-06T23:32:26+05:30

రాయలసీమ కర్మ కోసమే వైసీపీ ప్రభుత్వం రాయలసీమ గర్జన తలపెట్టిందని టీడీపీ పొలి ట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. స్కూల్‌ పిల్లలతో గర్జన నిర్వహించడం దుర్మార్గమన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్కూల్‌ పిల్లలతో గర్జన ఏర్పాటు చేయడం దుర్మార్గం

వైసీపీ పాలనలో సీమకు చేసింది శూన్యం

కడప ఎర్రముక్కపల్లి, డిసెంబరు6: రాయలసీమ కర్మ కోసమే వైసీపీ ప్రభుత్వం రాయలసీమ గర్జన తలపెట్టిందని టీడీపీ పొలి ట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. స్కూల్‌ పిల్లలతో గర్జన నిర్వహించడం దుర్మార్గమన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో సీమకు చేసింది శూన్యమని తెలిపారు. కడప నగరం గాయత్రి టవర్స్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమలో వైసీపీకి చెందిన 49 ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎంపిలుండి రాయలసీమ ప్రాంతానికి ఈ నాలుగేళ్లలో ఏమి చేశా రో ప్రజలకు చెప్పాలన్నారు. గండికోట అడిషన్‌లిఫ్ట్‌కు 2020లో 3500 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి అయిన ఖర్చు చేశారా అని ప్రశ్నించారు.

జీఎన్‌ఎ్‌సఎ్‌సలో భాగంగా గండికోట బైపాస్‌ టెండర్లకు సంబంధించి 600ల కోట్లల్లో ఒక్క తట్ట మట్టైనా తొలగించారా అని ప్రశ్నించారు. సీబీఆర్‌ నుంచి ఎర్రబల్లి లిఫ్ట్‌కు 1111 కోట్లు కేటాయించి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చెప్పగలరా అని ప్రశ్నించారు. జీఎన్‌ఎ్‌సఎ్‌స నుంచి హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స లిఫ్ట్‌ పేరుతో 5026 కోట్లకు జీఓ ఇచ్చి ఎన్ని రూపాయలు ఖర్చు చేశారన్నారు. కుందూ జలదరాశికి కనీసం ఎకరా భూమి,ని కూడా సేకరించలేక పోయారని ఎద్దేవా చేశారు. రెండో విడత జీఎన్‌ఎ్‌సఎ్‌స కాల్వ నిర్మాణానికి 20 వేల కోట్లు మంజూరు చేస్తే కేంద్రం అనుమతి ఇస్తుందని, ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఎందుకు చెల్లించలేక పోయారన్నారు. ఆర్టీపీపీని కూడా మూసివేసే ప్రయత్నంలో ఉన్నారని విమర్శించారు. రాయలసీమ గర్జన పేరుతో ఎందుకు సభ ఏర్పాటు చేశారో వారికే తెలియాలన్నారు.

హైకోర్టు ఏర్పాటు కోసం టీడీపీ అనుమతి ఎందుకో చెప్పాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి చూపాలని మేము కూడా దాన్ని స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ గర్జన పేరు తో ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన సభకు ఎంత మంది ఎమ్మెల్యే, ఎంపీలు వచ్చారో చెప్పాలన్నారు. రాయలసీమ వాసిగా సీఎం జగన్‌ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. కార్య క్రమంలో టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ట్ర ఉపాధ్యక్షుడు జిలాని బాషా, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు, యాదవ్‌ సాధికార కమిటీ జిల్లా అధ్యక్షుడు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising