ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గండికోట నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-12-15T23:19:13+05:30

గండికోట నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గురువారం కలెక్టర్‌ విజయరామరాజును ఆయన ఛాంబర్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, నిర్వాసితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

కొండాపురం, డిసెంబరు 15: గండికోట నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గురువారం కలెక్టర్‌ విజయరామరాజును ఆయన ఛాంబర్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా మొదటి విడతలో 14 గ్రామాలకు ఇంకా రూ.3.25లక్షల పరిహారం చెల్లించలేదన్నారు. అదేవిధంగా కొండాపురం గ్రామానికి సంబంధించి ముంపునకు గురైన జడ్పీ హైస్కూల్‌, జూనియర్‌ కళాశాల, లైబ్రరీతో పాటు ప్రభుత్వ కార్యాలయాల స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయలేదని, వెంటనే వాటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గండికోపునరావాస కేంద్రాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అర్హులై ఉండి కొండాపురం గ్రామంతో పాటు మిగిలిన ముంపు గ్రామాల్లో పరిహారం అందని వారు చాలా మంది ఉన్నారని, వారికి సప్లిమెంటరీ జాబితాలో వెంటనే పరిహారం ఇప్పించాలని కోరారు. గండికోట నిర్వాసితులు సర్వం కోల్పోయి చాలా మంది నిరుద్యోగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఉపాధి కల్పించేందుకు ఆప్రాం తం లో ఒక పరిశ్రమను తక్షణం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొండాపురం గ్రామంలోని శివసాయి ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లో పక్కనే ఉన్న డంపింగ్‌యార్డు వల్ల నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డంపింగ్‌యార్డును మరో చోటకు మార్చాలని కోరారు. అదేవిధంగా కొండాపురంలో ఎస్సీ, బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని నిర్వాసితులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. బీజేపీ నాయకులు గండ్లూరు శంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, గిరీ్‌షనాథ్‌, రామ్మోహన్‌, వెంకటరమణ, మహబూబ్‌ బాష, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising