ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం దృష్టికి ప్రైవేటు పాఠశాలల సమస్యలు

ABN, First Publish Date - 2022-05-23T05:59:36+05:30

రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి


కడప(ఎడ్యుకేషన్‌), మే 22 : రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి తెలిపారు. కడప నగరం చిన్నచౌక్‌ ప్రియదర్శిని కల్యాణ మండపంలో అపుస్మా జిల్లా అధ్యక్షుడు గంగయ్య అధ్యక్షతన అపుస్మా సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాల నుంచి ప్రైవేటు పాఠశాలలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా పాఠశాలల గుర్తింపును ఐదేళ్ల నుంచి మూడేళ్లకు ప్రభుత్వం తగ్గించిందని అది 10 ఏళ్ల వరకు పొడిగించాలని కోరినట్లు చెప్పారు. అలాగే వాటితో పాటు మరికొన్ని సమస్యలను కూడా వివరించారన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అందరి సహకారంతో ప్రతి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు నాగపీరయ్య, సీనియర్‌ నాయకులు ఎన్‌.శంకర్‌రెడ్డి, బి.రవీంద్రారెడ్డి, ఎలియాస్‌రెడ్డి, వి.ఆర్‌.రెడ్డితో పాటు ఉమ్మడి కడప జిల్లాల నుంచి 300 వరకు ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. 


జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గంగయ్య, రమణారెడ్డి

జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అపుస్మా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బి.గంగయ్య (బాలవికాస్‌ హైస్కూల్‌), పి.వి.రమణారెడ్డి (శ్రీ వశిష్ట హైస్కూల్‌)లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శిగా పి.వి.సుబ్బయ్య (శ్రీ సాయి హైస్కూల్‌), కోశాధికారిగా ఎ.సుధాకర్‌ (ఎస్‌.వి.ఆర్‌.హైస్కూల్‌), ట్రాన్స్‌పోర్ట్‌ కన్వీనర్‌గా నాగసుబ్బారెడ్డి (శ్రీభాష్యం హైస్కూల్‌)లను ఎన్నుకున్నారు. అలాగే వీరితో పాటు మరో 27 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో అపుస్మా నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-23T05:59:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising