ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభమైన అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2022-05-31T05:28:53+05:30

అయ్యప్పస్వామి నూతన దేవాలయం కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కన నాధనాగేశ్వరకోన దారిలో నిర్మించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాజీపేట, మే 30:  అయ్యప్పస్వామి నూతన దేవాలయం కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కన నాధనాగేశ్వరకోన దారిలో నిర్మించారు. ఈ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా ప్రారంభించారు. గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప, మాలికాపురత్తమ, నవగ్రహ, ధ్వజ, పదునెట్టంబడి దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ జూన్‌ 4వ తేదీ జరుగుతుంది. కాగా సోమవారం గణపతి పూజతో ప్రారంభించి మహామృత్యుంజయ హోమం, మంగళవారం జలాదివాసం, వాస్తుహోమం, మొలపూజ, బుధవారం శాంతిహోమం, హోమగుండం, శుద్ధి, కలశాభిషేకం, లక్ష్మీపూజ, శుక్రవారం షయ్యాదివాసం, నేత్ర ఉల్లేఖనం, ఆదివాస హోమాలు జరుగుతాయి. శనివారం విగ్రహ ప్రతిష్ఠతోపాటు పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. కేరళ పండితులు కృష్ణశర్మవారిచేపూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి రూ.కోటికిపైగా ఖర్చు చేసి సుందరంగా నిర్మించారు. ప్రతిష్ఠ విగ్రహ మూర్తులను సోమవారం ఊరేగించారు. భక్తులు తరలి వచ్చి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-05-31T05:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising