పాల ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి
ABN, First Publish Date - 2022-12-16T23:38:01+05:30
ప్రొద్దుటూరులో మూత పడిన పాలఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ఎన్నికల హామీల్లో చెప్పిన మాటను వైసీపీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి రామయ్య డిమాండ్ చేశారు.
సీపీఐ, జనసేన ఆందోళన
ప్రొద్దుటూరు అర్బన్ , డిసెంబరు 16 : ప్రొద్దుటూరులో మూత పడిన పాలఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ఎన్నికల హామీల్లో చెప్పిన మాటను వైసీపీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల రోడ్డులోని పాల ఫ్యాక్టరీని పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ ధర్నా చేశారు. తహసీల్దారు నజీర్ అహ్మద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ 1980 లో ప్రారంభించిన ప్రొద్దుటూరు పాల ఫాక్టరీ 1995 వరకు బాగా నడిచిందన్నారు.ఫేడరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫ్యాక్టరీని పాల ఉత్పత్తి దారుల సంఘం కు అప్పగించటం వలన రాజకీయాలు ప్రవేశించి ఫ్యాక్టరీ మూతపడటానికి కారణమైందన్నారు. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో చిత్తూరు పాలఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని నిర్ణయించారని, కానీ సీఎం సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు పాల ఫ్యాక్టరీనివిస్మరించటం దురదృష్టకరమన్నారు. పట్టణ సహాయ కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ జిల్లాలో వున్న ఫ్యాక్టరీలు మూత పడటమేకాని ఒక్క కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి కల్సించలేదన్నారు. జనసేన నియోజకవర్గ అధ్యక్షుడు జిలాన్ మాట్లాడుతూ వైసీపీ ఎన్నికల్లో ప్రొద్దుటూరు ప్రజలకిచ్చిన ఫ్యాక్టరీల పునరుద్ధరణ, కొత్త పరిశ్రమల ఏర్పాటు హామీలను విస్మరించిందని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకుడు నాగరాజు, జిల్లా సీపీఐ కౌన్సిల్ సభ్యుడు చంద్రశేఖర్, ట్రేడ్ యూనియన్‌నేతలు మద్దిలేటి, నరసింహ, గురుస్వామి, ప్రతాప్, ప్రమీల, జనసేన పట్టణ కమిటీ కన్వీనర్ రామారావు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:38:19+05:30 IST