ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల రీ సర్వేను పరిశీలించిన రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు

ABN, First Publish Date - 2022-08-19T05:25:07+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ భూముల స్వచ్ఛీకరణలో భాగంగా మండల పరిధిలోని ఎస్‌.రామాపురం గ్రామంలో రీసర్వే పనులను గురువారం ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు, జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రాష్ట్ర స్టీరింగ్‌ కమిటటీ సభ్యుడు అజయ్‌ కల్లాం, సర్వే సెటిల్‌మెంట్‌, భూ రికార్డుల శాఖ కమిషనర్‌ సిద్దార్థ్‌ జైన్‌లు పరిశీలించారు.

రీసర్వే జరిగిన భూములను పరిశీలిస్తున్న రాష్ట్ర స్టీరింగ్‌ కమిటటీ సభ్యులు అజయ్‌కలల్లాం, సిద్దార్థ్‌ జైన్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెండ్లిమర్రి, ఆగస్టు 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ భూముల స్వచ్ఛీకరణలో భాగంగా మండల పరిధిలోని ఎస్‌.రామాపురం గ్రామంలో రీసర్వే పనులను గురువారం ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు, జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రాష్ట్ర స్టీరింగ్‌ కమిటటీ సభ్యుడు అజయ్‌ కల్లాం, సర్వే సెటిల్‌మెంట్‌, భూ రికార్డుల శాఖ కమిషనర్‌ సిద్దార్థ్‌ జైన్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి భూ సమస్యలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఈ రీసర్వేను చేపట్టడం జరిగిందన్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రతి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఒక గ్రామాన్ని ఎంచుకొని మొదటి విడతలో రీసర్వే భూములను పూర్తి చేయడం జరిగిందన్నారు. కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఎస్‌. రామాపురం గ్రామంలో ఈ రీసర్వే పూర్తయిందన్నారు. రీసర్వే అయిన భూములను అధికారులతో కలిసి రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మొయిళ్లకాల్వ గ్రామ సచివాలయాన్ని పరిశీలించి అక్కడ భూముల రీసర్వేపై రైతులతో మాట్లాడారు. రీ సర్వేకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, కడప, జమ్మలమడుగు ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓ రమణారెడ్డి, సర్వే ఏడీ ప్రసాదరాజు, తహసీల్దార్‌ ఉదయ్‌భాస్కర్‌రాజు, ఆర్‌ఐ శ్రీనివాసులు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising