ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా లక్ష్మీనృసింహుడి కల్యాణం

ABN, First Publish Date - 2022-05-18T05:27:15+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజంపేట పట్టణ పరిధిలోని భువనగిరి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి దివంగత పసుపులేటి బ్రహ్మయ్య కుమారులు పసుపులేటి ప్రదీ్‌పకుమార్‌, పసుపులేటి పవన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్న మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ ఎత్తున హాజరైన జనం

రాజంపేట టౌన్‌, మే 17: ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజంపేట పట్టణ పరిధిలోని భువనగిరి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి దివంగత పసుపులేటి బ్రహ్మయ్య కుమారులు పసుపులేటి ప్రదీ్‌పకుమార్‌, పసుపులేటి పవన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. పసుపులేటి కుటుంబ సభ్యులు ముత్యాల తలంబ్రాలను, పట్టువస్త్రాలను, మాంగళ్యధారణను తీసుకురాగా వారిని ఆలయ కమిటీ సభ్యులు మేళతాళాలతో కల్యాణ వేదిక వద్దకు ఆహ్వానించారు. ఈ కల్యాణోత్సవంలో మాజీ ఆర్టీసీ చైర్మన్‌ ఎద్దల సుబ్బరాయుడు, ఆలయ ధర్మకర్తలు పూల హరిప్రసాద్‌, కె.వెంకటరమణ, ఎన్‌.రాజశేఖర్‌, కంబాయిగారి సుబ్బనరసింహులు, మన్నేరు లక్ష్మీనరసయ్య, కొమ్మూరు సుబ్బనరసయ్య, మాజీ సర్పంచ్‌ ఎం.ఎల్‌.నారాయణ, మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ ఎద్దల విజయసాగర్‌లతో పాటు పలువురు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడానికి రాజంపేట పట్టణం నుంచే కాక కోడూరు, ఓబులవారిపల్లె, నందలూరు, ఊటుకూరు, పోలి, పుల్లంపేట చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భువనగిరిపల్లె గ్రామస్థులు, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారులు ప్రదీప్‌, పవన్‌ల ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

గజవాహనంపై విహరించిన నృసింహుడు

రాజంపేట, మే 17: మండలంలోని భువనగిరిపల్లె లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం గజవాహనంపై స్వామివారు ఊరేగారు. జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి గజవాహన సేవలో పాల్గొని వాహనాన్ని మోశారు. తదనంతరం జరిగిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సౌమ్యనాథస్వామి ఆలయ చైర్మన్‌ అరిగెల సౌమిత్రి, గడికోట వెంకటసుబ్బారెడ్డి, దాసరి పెంచలయ్య, పోలి మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:27:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising