ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం ఇచ్చే ధరకు భూములు ఇవ్వం

ABN, First Publish Date - 2022-08-13T05:15:56+05:30

కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూములు ఇవ్వలే మని రైతులు అధికారులకు తేల్చిచెప్పారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీఓ శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాపాడు, ఆగస్టు 12: కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూములు ఇవ్వలే మని రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. నక్కలదిన్నెలో శుక్రవారం భూ సేకరణకు సంబంధిం చి నిర్వహించిన గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం హైవేకు ప్రకటించిన రోడ్లకు భూములు ఇవ్వాల ని జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దారు యామిని రైతులను కోరారు. ఎకరాకు రూ.6.10 లక్షలు చొప్పున చెల్లించి కొనుగోలు చే స్తామని ఆర్డీఓ చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భూమి విలువను బట్టి మరికొంత డబ్బు అదనంగా ఇస్తున్నట్లు చెప్పారు.

ఇది కేంద్రప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి ధర పెంపు విషయంలో ఎవరి చేతిలోనూ లేదన్నారు. తిప్పిరెడ్డిపల్లె నుంచి జడ్జి కొట్టాలు వరకు 17 కి.మీ. పొడవునా హైవే నిర్మిస్తున్నట్లు చెప్పారు. చట్టప్రకారం భూములు సేకరిస్తున్నట్లు చెప్పారు. భూముల్లో ఉన్న తొట్లు, వ్యవసాయ ఫిల్టర్లకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. రైతులు ఒప్పుకోకున్నా చట్టప్రకారం హైవే నిర్మించేందుకు భూములు ఇప్పించుకుంటామన్నారు. ఈనెల చివరికల్లా రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. ప్రైవేటు మార్కెట్‌లో ఎకరా సుమారు రూ.20 లక్షలకు ధర పలుకుతుండగా ప్రభుత్వం రూ.6 లక్షల తక్కువ ధరకు ఇవ్వలేమని రైతులు ఆర్డీఓకు విన్నవించారు. సమావేశంలో అనంతపురం, కుచ్చుపాప, నక్కలదిన్నె, ఓబాయపల్లె బాధిత రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-13T05:15:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising