ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల రీసర్వే పకడ్బందీగా చేపట్టాలి

ABN, First Publish Date - 2022-05-28T05:17:04+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టి కచ్చితమైన రికార్డులను రూపొందించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. శుక్రవారం మాసాపేట సమీపంలోని శ్రీసాయి ఇన్‌స్టిట్యూట్‌ టెక్నాలజీ సైన్సె్‌సలో వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం (రీసర్వే)లో భాగంగా ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అంశంపై రాయచోటి రెవెన్యూ డివిజన్‌లోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్‌వోలకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూ యజమానుల ఆస్తులకు శాశ్వత హక్కు కల్పన : కలెక్టర్‌ 

రాయచోటి(కలెక్టరేట్‌), మే 27: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టి కచ్చితమైన రికార్డులను రూపొందించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. శుక్రవారం మాసాపేట సమీపంలోని శ్రీసాయి ఇన్‌స్టిట్యూట్‌ టెక్నాలజీ సైన్సె్‌సలో వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం (రీసర్వే)లో భాగంగా ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌  రికార్డ్స్‌ అంశంపై రాయచోటి రెవెన్యూ డివిజన్‌లోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్‌వోలకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ఏళ్ల తరబడి అనేక వివాదాలకు కారణమవుతున్న భూవివాదాలు, పొలంగట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రారంభించిందన్నారు. అస్తవ్యస్థంగా, తప్పుల తడకగా ఉన్న భూ రికార్డులను స్వచ్ఛీకరణ చేసి వివాదాలను పూర్తిగా రూపుమాపడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రీసర్వే చేసిన తరువాత ప్రతి సర్వేనెంబరుకు పక్కాగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు సంబంధించి ప్రొఫార్మా-1 నుంచి ప్రొఫార్మా-6 వరకు పెండింగ్‌ లేకుండా జూన్‌ 15 కల్లా జాబితాలు పూర్తి కావాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే చుక్కల భూమి, పొరంబోకు భూమి, వాటర్‌బాడీస్‌ భూములపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో తప్పులు చేస్తే సంబంధిత వీఆర్‌వోకు వేటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీవో రంగస్వామి, రాయచోటి తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి, రాయచోటి రెవెన్యూ డివిజన్‌ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T05:17:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising