ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందేళ్ల కష్టఫలాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి

ABN, First Publish Date - 2022-08-16T05:41:28+05:30

వందేళ్ల భారతానిలో తెల్లదొరలను తరిమికొట్టేందుకు దాదాపు మూడున్నర లక్షల మంది ధన, మాన, ప్రాణాలను పోగొట్టుకున్నారని వారి కష్ట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్రాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని స్వాతంత్ర సమరయోధుడు పెడబల్లె బాలయల్లారెడ్డి అన్నారు.

చెన్నూరు: సన్మానం అనంతరం మాట్లాడుతున్న స్వాతంత్య్ర సమరయోధుడు బాలయల్లారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, ఆగస్టు 15: వందేళ్ల భారతానిలో తెల్లదొరలను తరిమికొట్టేందుకు దాదాపు మూడున్నర లక్షల మంది ధన, మాన, ప్రాణాలను పోగొట్టుకున్నారని వారి కష్ట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్రాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని స్వాతంత్ర సమరయోధుడు పెడబల్లె బాలయల్లారెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1847 నుండి 1947 వరకు దేశవ్యాప్తంగా బ్రిటీష్‌ వారిని తరిమికొట్టేందుకు మహనీయులు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదని ఒక వైపు ఆయుధ పోరాటం, మరో వైపు శాంతీయుత పోరాటాలతో భరత మాతను తె ల్ల దొరల నుండి విముక్తి గావించారన్నారు. నాటి తెల్లదొరల నుండి  కాపాడుకున్న మన స్వేచ్చను నీతి, నిజాయతీకి  వినియోగిచాలి తప్ప ఎలాంటి చెడు మార్గాల వైపు మల్లించ కూదన్నారు, నాటి కష్టాలను తలుచుకుంటూ నేటికీ గుండెలు బరువెక్కుతున్నాయని ఎంతో కష్టపడి సాధించుకున్న స్వాతంత్రాన్ని, మన స్వేచ్ఛను ఎవరికి తాకట్టు పెట్టకూడదన్నారు. ముఖ్యంగా యువత సరైన మార్గంలో నడిచినప్పుడే భారతదేశ ఔనత్యం ఖండాతరాలకు మరింతగా వ్యాపిస్తుందని, ఇప్పటికే దేశ ప్రధాని 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలను ఘనంగా  నిర్వహించాలని పిలుపునిచ్చి నిర్వహిస్తుండడం సంతోషదాయకమన్నారు. 

Updated Date - 2022-08-16T05:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising