ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జిల్లాల ఏర్పాటు అభినందనీయం

ABN, First Publish Date - 2022-01-27T04:39:36+05:30

రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా తెలిపారు.

అంజాద్‌బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 26: రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఒక్కో హామీ నెరవేర్చుతున్నారన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అనేది ముఖ్యమంత్రి వైఎ్‌స.జగన్‌ లక్ష్యమని చెప్పారు.

26 జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే మూ డు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజలు  స్వాగతిస్తారన్నారు. 

జిల్లాల పునర్విభజనతో మరింత ప్రగతి : జడ్పీ చైర్మన్‌

కడప రూరల్‌, జనవరి 26: జిల్లాల పునర్విభజనతో పల్లెసీమల ప్రగతి మరింతగా జరుగుతుందని జడ్పీ చైర్మన్‌ అకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో ఆయన అకౌంట్‌ ఆఫీసర్‌ రంగాచార్యులతో కలిసి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్‌. నాగిరెడ్డి, లంకా మల్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-27T04:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising