వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
ABN, First Publish Date - 2022-12-07T23:14:32+05:30
ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైఎస్‌ఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు.
ఫమాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి
గాలివీడు, డిసెంబరు 7: ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైఎస్‌ఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నూలివీడు పంచాయతీ నక్కలవాండ్లపల్లెలో ఆ యన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ప్రస్తుత ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. ముఖ్యంగా బీసీలపై కప ట ప్రేమ చూపుతోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారన్నారు. రైతులు, కార్మికులు, కర్షకులు, మైనార్టీలు బీసీలు ఈ ప్రభుత్వాన్ని సాగనంప డానికి ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పె ద్దు చిన్నపరెడ్డి, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, యోగాంజనేయులు, నూలివీడు వెంక ట్రమణ, వీరాంజనేయులు, నక్కల పెద్దరెడె ్డప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విగ్రహం మాయం .. ప్రభుత్వ కుట్రే..
రాయచోటిటౌన్: జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్ర హం మాయం ప్రభుత్వ కుట్ర అని రాయచోటి ని యోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆ యన పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలే కరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాల యాల ధ్వంసం, విగ్రహాల కూల్చివేతలు అధిక మయ్యాయన్నారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కి, వారిపైనే దాడులు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి, వారి అనుచరులకు గుణపాఠం చెప్పే రోజులు ద గ్గర పడ్డాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం మాయం చే యడం ప్రభుత్వ దురహంకారానికి పరాకాష్ట అన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని మాయం చేయ డం నీతిమాలిన చర్య అని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, పట్టణ అధ్యక్షుడు ఖాదర్ వలి, రాజంపేట పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాఽ ద్యక్షుడు అబూజర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:15:07+05:30 IST