గర్భిణులకు పరీక్షలు తప్పనిసరి
ABN, First Publish Date - 2022-04-09T05:01:50+05:30
ప్రతి మహిళా గర్భం దాల్చిన రోజు నుంచి కాన్పు సమయం వరకు జాగ్రత్తగా ఉండి అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని జమ్మలమడుగు డివిజన్ వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శాంతికళ పేర్కొన్నారు.
మైలవరం, ఏప్రిల్ 8: ప్రతి మహిళా గర్భం దాల్చిన రోజు నుంచి కాన్పు సమయం వరకు జాగ్రత్తగా ఉండి అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని జమ్మలమడుగు డివిజన్ వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శాంతికళ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వద్దిరాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బందిపై ఆరా తీశారు. హాస్పిటల్‌లో సమస్యలను తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వద్దిరాల వైద్యురాలు మేరీ దీప్తి, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-04-09T05:01:50+05:30 IST