ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: ఏపీటీఎఫ్
ABN, First Publish Date - 2022-12-15T23:58:00+05:30
ఉపాఽధ్యాయ బదిలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శేఖర్‌బాబు, కడప ప్రధాన కార్యదర్శి సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు.
కడప (ఎడ్యుకేషన), డిసెంబరు 15: ఉపాఽధ్యాయ బదిలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శేఖర్‌బాబు, కడప ప్రధాన కార్యదర్శి సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. కడప నగరం ఏపీటీఎఫ్ కార్యాలయంలో గురువారం ఉపాధ్యాయ సమస్యలపై ముఖ్య కార్యకర్తలతో ఆనలైన ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బదిలీ నిబంధనల్లో పేర్కొన్నట్లు ప్రిపరెన్షియల్ కేటగిరి కింద దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేకంగా మెడికల్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి ధృవపత్రాలు మంజూరు చేసేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లాలో కొంత మందికి బదిలీల పాస్‌వర్డ్ రావడంలేదని, అటువంటి వారికి సమస్య పరిష్కారం అయ్యే విధంగా జిల్లాలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. పాత పాయింట్లు మంజూరు విషయంలో ఉన్న స్తబ్ధతపై ఉన్నతాధికారులకు తాజా సమస్యలను విన్నవించి క్లారిఫికేషన తెచ్చుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, అన్నమయ్య జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అలీఖాన, వెంగల్‌రెడ్డి, నాయకులు ఈశ్వర్‌చంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, వీర ప్రసాద్, రాజగోపాల్, సత్యనారాయణ, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:58:03+05:30 IST