సమాజ మార్పునకు మూలం ఉపాధ్యాయులే
ABN, First Publish Date - 2022-10-18T05:03:57+05:30
సమాజ మార్పు, చైతన్యానికి మూలం ఉపాధ్యాయులేనని జిల్లా విద్యాశాఖాధికారి చెప్పలి దేవరాజ్, సమగ్ర శిక్ష జిల్లా అధికారి డాక్టర్ అంబవరపు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
డీఈఓ దేవరాజ్, ఎస్‌ఎ్‌సఏ పీఓ ప్రభాకర్‌రెడ్డి
కడప (ఎడ్యుకేషన్), అక్టోబరు 17 : సమాజ మార్పు, చైతన్యానికి మూలం ఉపాధ్యాయులేనని జిల్లా విద్యాశాఖాధికారి చెప్పలి దేవరాజ్, సమగ్ర శిక్ష జిల్లా అధికారి డాక్టర్ అంబవరపు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప నగరం సీఎ్‌సఐ హైస్కూలులో గల డీసీఈబీ హాలులో కడప మండలానికి సంబంధించి టీచింగ్ అట్ ద రైట్ లెవల్ నాలుగురోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతో పాటు వినయ విధేయతలను, నైతిక విలువలను పెంపొందించే దిశగా బోధన సాగించాలన్నారు. చదువుతో పాటు ఆట పాటలు విద్యార్ధికి నేర్పించినప్పుడే ఆ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి పొందుతాడన్నారు. కార్యక్రమంలో కడప ఎంఈవో పాలెం నారాయణ, సీనియర్ రిసోర్స్ పర్సన్ శివారెడ్డి, బాలానాయుడు, సాహెబ్‌జాన్, కాంతావలి, నాగమణికుమారి, హజీరాభాను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:03:57+05:30 IST