ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే

ABN, First Publish Date - 2022-09-28T05:26:10+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించి... వారి భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ విజయరామరాజు


కడప(కలెక్టరేట్‌) సెప్టెంబరు 27: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించి... వారి భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాలులో జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి అంబవరం ప్రభాకర్‌ రెడ్డి అధ్యక్షతన విద్యాశాఖాధికారుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ధృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టిందన్నారు. మనబడి నాడు-నేడు అనే బృహత్తర పథకాలను అన్ని రకాల మౌలిక వసతులతో కల్పిస్తోందన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సధుపాయాలను సక్రమంగా సమకూర్చి, పాఠశాలలను ఆధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దాలని విధ్యాశాఖాధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, పరిశుభ్రత, సరైన సమయానికి పాఠశాలలకు వచ్చేలా చర్యలతో పాటు ఉపాధ్యాయుల కూడా సమయ పాలన పాటించాలన్నారు. రెండో విడత నాడు-నేడు ద్వారా రూ.325 కోట్లతో జిల్లాలోని 8 ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి దేవరాజు, ఎంఈఓలు, ఇతర విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-09-28T05:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising