ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ ఉద్యమాలకు టీడీపీ మద్దతు

ABN, First Publish Date - 2022-01-21T04:44:49+05:30

పీఆర్సీ, ఐఆర్‌ డీఏలతో పాటు ఇతర అలవెన్స్‌లలో తీవ్ర అన్యాయం జరిగిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న గోవర్ధన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌

కడప (నాగరాజుపేట), జనవరి 20: పీఆర్సీ, ఐఆర్‌ డీఏలతో పాటు ఇతర అలవెన్స్‌లలో తీవ్ర అన్యాయం జరిగిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి  తెలిపారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నమ్మిన వారిని వంచించడం జగన్‌ సర్కార్‌ నైజం అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 43 శాతం పీఆర్సీని ప్రకటిస్తే ఈ ప్రభుత్వం మాత్రం 23 శాతం ప్రకటించడం దారుణమన్నారు. అర్ధరాత్రి విడుదల చేసిన జీఓలతో ఉద్యోగులు, పెన్షనర్లు రోడ్డు పాలవుతున్నారన్నారు. న్యాయమైన కోర్కెలు కోరుతున్న ఉద్యోగ సంఘాల నాయకులను అర్ధరాత్రి నుంచి గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే మెరుగైన జీతాలు అందిస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం లేదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వచ్చిన పరిస్థితే పోలీసులకు కూడా వస్తుందని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. సమావేశంలో ఉపాధి హామీ మాజీ కౌన్సిల్‌ సభ్యుడు పీరయ్య, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు అఫ్జల్‌ఖాన్‌, అమీర్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising