ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6న మదనపల్లెలో టీడీపీ మినీ మహానాడు

ABN, First Publish Date - 2022-06-25T05:17:41+05:30

మదనపల్లెలో టీడీపీ మినీ మహానాడు సభను జూలై 6వ తేదీన ఏర్పాటు చే సేందుకు తేదీ ఖరారయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

నేతలతో చర్చిస్తున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, జూన్‌ 24: మదనపల్లెలో టీడీపీ మినీ మహానాడు సభను  జూలై 6వ తేదీన ఏర్పాటు చే సేందుకు తేదీ ఖరారయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు టీడీపీ అధిష్టానం నుంచి స్థానిక నాయకులకు స్పష్టమైన సమాచా రం అందినట్లు తెలియవచ్చింది. ఇదిలా వుండగా మదనపల్లె మినీ మహానాడు సభ అనంతరం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 6వ తేదీ రాత్రి కలికిరిలో బస చేయనున్న సమాచారం నేప థ్యంలో అవసరమైన ఏర్పాట్ల కోసం ఆ పార్టీ జాతీ య ప్రఽధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి శుక్రవారం కడప మార్గంలోని హేమాచారి కల్యాణ మండపాన్ని పరిశీలించారు. పార్టీ శ్రేణుల భోజన వసతి సదుపాయాలకు ఇక్కడే అను కూలంగా వుంటుందని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కల్యాణ మండపం వద్ద పీలేరు, కలికిరి మండల నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, కోటపల్లె బాబు రెడ్డి, అమరనాథ రెడ్డి, చంద్రశేఖర్‌, మల్‌ రెడ్డి, కృష్ణా రెడ్డి తదితరులు హాజరయ్యారు. కాగా మినీ మహానాడు ఏర్పాట్ల కోసం కిశోర్‌కుమార్‌ రెడ్డి శనివారం మదనపల్లెలో పర్యటించనున్నారు.  రాజంపేట పరిశీలకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పార్లమెంటు అధ్యక్షుడు ఆర్‌. శ్రీనివాసులు రెడి, స్థానిక నాయకులతో చర్చించిన అనంతరం మినీ మహానాడు సభా స్థలిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-06-25T05:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising