ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏజీ గార్డెన్‌లో తాగునీటి సమస్య పరిష్కరించండి

ABN, First Publish Date - 2022-06-07T06:02:15+05:30

రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఏజీ గార్డెన్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సీపీఐ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, జూన్‌ 6: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఏజీ గార్డెన్‌లో  తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన సీపీఐ నేతలతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  2011 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఇందిరమ్మ గృహాలు నిర్మించగా ఇప్పటివరకు తాగునీరు, సిమెంటు రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  11 ఏళ్లుగా కాలనీ వాసులు  ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.  ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని,  లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వంగిమళ్ల  రంగారెడ్డి, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి జక్కల వెంకటేష్‌, గిరిజన సంఘం నాయకులు పోలరి అశోక్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యులు తుమ్మల లవకుమార్‌, కాలనీ వాసులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-07T06:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising