రైతన్నలకు కొండంత ఆసరా
ABN, First Publish Date - 2022-10-18T04:31:23+05:30
వైఎ్‌సఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం రైతులకు కొండంత ఆసరాగా నిలుస్తోందని కలెక్టర్ పీఎస్ గిరీషా అన్నారు.
రైతు భరోసా పంపిణీలో కలెక్టర్ గిరీషా
రాయచోటి టౌన్, అక్టోబరు 17: వైఎ్‌సఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం రైతులకు కొండంత ఆసరాగా నిలుస్తోందని కలెక్టర్ పీఎస్ గిరీషా అన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలోని మార్కెట్‌యార్డులో జిల్లాకు సంబంధించిన వైఎ్‌సఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద నాల్గో ఏడాది రెండో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా పడుతోందని తెలిపారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా వైఎ్‌సఆర్ రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన రైతులకు రూ.88.86 కోట్ల విలువ చేసే మెగా చెక్కును కలెక్టర్, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి రైతులకు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సుకుమార్‌రెడ్డి, జిల్లా సభ్యుడు దిన్నెపాటి రవిరాజు, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాషా, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, జడ్పీటీసీ వెంకటేశ్వరరెడ్డి, మానస వెంకట్రమణ, మాజీ వైస్ ఎంపీపీ గంగిరెడ్డి, కౌన్సిలర్లు సుగవాసి ఈశ్వర్‌ప్రసాద్, జాకీర్‌హుస్సేన్, సుగవాసి శ్యాంకుమార్, జానం రవీంద్రయాదవ్, రియాజ్, వైసీపీ నాయకులు తిరుపాల్‌నాయుడు, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:31:23+05:30 IST