ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతకు స్ఫూర్తి సుభాష్‌ చంద్రబోస్‌

ABN, First Publish Date - 2022-01-24T04:24:29+05:30

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌ యువతకు స్ఫూర్తి అని రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ స్వరూ్‌పకుమార్‌రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు టంగుటూరు మారుతిప్రసాద్‌, సంస్కృతి సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, జనవరి 23 : స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌ యువతకు స్ఫూర్తి అని రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ స్వరూ్‌పకుమార్‌రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు టంగుటూరు మారుతిప్రసాద్‌, సంస్కృతి సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఆదివారం కోర్టు వద్ద ఉన్న నేతాజీ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడానికి కృషి చేశారన్నారు. జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేని ఏకైక స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ మాత్రమేనన్నారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. కార్యక్రమంలో గజ్జల వెంకటేశ్వరరెడ్డి, కొండారెడ్డి, వెంకటరామిరెడ్డి, ఓబుళరెడ్డి, జయప్రకాశ్‌, జాకీర్‌ అహ్మద్‌, ఎర్రన్న, శివారెడ్డి, విష్ణునారాయణ యాదవ్‌, యడవల్లి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రామేశ్వరంలోని బాలబాలికల గ్రంథాలయంలో నేతాజీ సుభాష్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో చైతన్య సాంఘిక సేవా సంఘం అద్యక్షుడు కరుమూరు వెంకటరమణయ్య, గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్‌ ఇబ్రాంసాహెబ్‌, సత్యనారాయణ, రవిచంద్ర, గోపాల్‌, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T04:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising