ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంతూళ్లకు విద్యార్థులు

ABN, First Publish Date - 2022-03-05T05:37:50+05:30

వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్‌ వెళ్లి అక్కడ యుద్ధవలయంలో చిక్కుకొని ఎన్నో అవాంతరాలను దాటుకుని విద్యార్థులు సొంత గడ్డ కడపపై అడుగు పెడుతున్నారు. మొన్నటి వరకు సాఫీగా వైద్యవిద్యను కొనసాగించిన విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధంతో క్షణ క్షణం నరకయాతన అనుభవించారు.

ఇంటికి చేరుకున్న శ్రీకర్‌రెడ్డికి మిఠాయిలు తినిపిస్తున్న కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్‌ బార్డర్‌ దాటేంత వరకు భయం భయం 

ఏమి జరుగుతుందోనన్న ఆందోళన 

మైదుకూరు / కడప, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్‌ వెళ్లి అక్కడ యుద్ధవలయంలో చిక్కుకొని ఎన్నో అవాంతరాలను దాటుకుని విద్యార్థులు సొంత గడ్డ కడపపై అడుగు పెడుతున్నారు. మొన్నటి వరకు సాఫీగా వైద్యవిద్యను కొనసాగించిన విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధంతో క్షణ క్షణం నరకయాతన అనుభవించారు. సైరన్‌ మోగగానే బంకర్లలో తలదాచుకోవడం, ఓ పక్క బాంబుల మోత, మరో పక్క రాకెట్‌, ఫిరంగుల బీభత్సంతో అసలు ప్రాణాలతో ఉంటామో లేదోనన్న భయంతో నిద్రలేని రాత్రులు గడిపారు. సొంత ఊళ్లకు వస్తామంటే అందుబాటులో ఉన్న ఎయిర్‌బే్‌సల పై రష్యా దాడి చేయడంతో అక్కడ ఉండలేక, ఇటు రాలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడిపారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని సొంతఊర్లకు చేర్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు హుటాహుటిన వివిధ మార్గాల్లో బార్డర్‌ చేరుకున్నారు. బార్డర్‌ దాటేంత వరకు భయం భయంగానే కాలం గడిపారు. ఉక్రెయిన్‌లో చదువుతున్న పలువురు విద్యార్థులు జిల్లాకు వచ్చారు. వారిని ఆంధ్రజ్యోతి ఫోన్‌లో పలకరించింది. యుద్ధంలో విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలను వివరించారు.


సైరన్‌ మోగితే భయపడేవాళ్లం

- శ్రీకర్‌ రెడ్డి, వరదాయపల్లె మైదుకూరు 

ఉక్రెయిన్‌ రాజధానిలో కీవ్‌లో బోగోమొలెట్స్‌ మెడికల్‌ యూనివర్శిటీలో ఎంబీబీఎస్‌ 3వ సంవత్సరం చదువుతున్నా. యూనివర్శిటీలో చదువుకుంటూ 5మంది కలసి గది అద్దెకు తీసుకొని ఉండేవాళ్లం. రష్యా దాడి చేస్తున్నట్లు అసలు తెలీదు. రాత్రి ఉన్నట్లు ఉండి ఉక్రెయిన్‌ ప్రభుత్వం సైరన్‌ మోగించి ఎవరూకూడా బయటకు రావద్దని చెప్పడంతో గదిలోనే ఉండిపోయాం. బయట మాత్రం బాంబుల శబ్దాలు వచ్చాయి. మా ఇన్‌స్టిట్యూట్‌ వెనుక ఉన్న ప్రాంతంలో బాంబు పడిన శబ్దం వినిపించింది. ఉక్రెయిన్‌లో  80 శాతం ఇళ్లల్లో బంకర్లున్నాయి. కీవ్‌ నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ పెట్టేవారు. వారానికి సరిపడ సరుకులు తెచ్చుకొని వండుకొని తినేవాళ్లం. అయితే మూడవ రోజు  కీవ్‌ ఖాళీ చేసి వెళ్లాలని చెప్పడంతో దాదాపు 750 కి.మీ రైల్లో ప్రయాణం చేసి సరిహద్దు దేశమైన హంగేరి రాజధాని బుడాపేస్ట్‌ చేరుకున్నాం. అక్కడ ప్రతి చోట స్వచ్ఛంద సంస్థలు, అధికారులు భోజనాలు టిఫిన్లు నీళ్లు అందించారు. 3వ తేదీన బుడాపేస్ట్‌ నుంచి ఢిల్లీకి విమానంలో చేరుకున్నాం. అక్కడ రాష్ట్ర అధికారులు మమ్మల్ను ఆంధ్ర భవన్‌కు చేర్చారు. అక్కడి నుంచి గురువారం రాత్రి హైదరాబాద్‌, శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి బస్సులో స్వంత ఖర్చులతో మైదుకూరుకు చేరుకున్నా. స్వగ్రామం చేరుకునేందుకు భారత ప్రభుత్వం మంచి చొరవ చూపింది.


బాధను దిగమింగుకొని మాట్లాడుతూ వచ్చాం

యుద్ధం జరుగుతున్న కీవ్‌లో  మేనల్లుడు ఉండటంతో చాలా భయపడ్డామని, బాధను దిగమింగుకొని శ్రీకర్‌రెడ్డితో మాట్లాడుతూ ధైర్యం చెబుతూ వచ్చామని అతడి మేనమామ శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు. టీవీలో యుద్ధాన్ని చూస్తూ భయపడ్డామని ప్రభుత్వం చొరవ, పాత్రికేయుల చొరవతో తమ పిల్లాడు ఇంటికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇంటికి చేరుకున్న శ్రీకర్‌రెడ్డిని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పరా మర్శించారు.

క్షణ క్షణం భయం భయంగా గడిపా

- మల్లెల వెంకటలోకేశ్‌, ఎన్జీవో కాలనీ, కడప

ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ 4వ సంవత్సరం చదువుతున్నా. గత ఏడాది జూన్‌లో ఇంటికి వచ్చా. ఉక్రెయిన్‌ రష్యా దాడిచేసిన మొదటి రోజున మేమున్న అపార్టుమెంట్‌ ప్రాంతంలో రెండు బాంబులు పడ్డాయి. కేరళకు చెందిన ఇద్దరు స్నేహితులతో ప్లాట్‌లోనే క్షణం క్షణం భయం భయంగా గడిపా. ముందస్తుగా ఆహారం తెచ్చుకున్నప్పటికీ ఎక్కడ బాంబులు పడతాయోనన్న భయం నెలకొంది. ఉక్రెయిన్‌లోని సరిహద్దు దేశాలకు చేరుకోవడంతో సొంతంగా ఓ వ్యాన్‌ బుక్‌ చేసుకొని 400 కి.మీ దూరంలోని స్లోవిక్యా చేరుకున్నాము. ట్రాఫిక్‌ తీవ్రంగా ఉండడంతో  13 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. ఢిల్లీ మీదుగా గురువారం బెంగళూరు చేరుకున్నా. స్వదేశానికి రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా సహాయం చేసింది. ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి రావడం సంతోషంగా ఉంది. వారం తరువాత కడపకు వస్తాం.


యుద్ధంతో ఆందోళన చెందాం

ఉక్రెయిన్‌లో ఉజ్రోడ్‌లో మెడిసిన్‌ మొదటి సంవత్సరం చదువుతున్నా. రష్యా యుద్ధం మొదలెట్టడంతో యుద్ధ ప్రాంతాల్లో ఉన్న మన దేశీయులు ఆందోళన చెందారు. స్వదేశానికి వచ్చేంత వరకు విమాన సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడ్డాం. 

- పి.లక్ష్మీధర్‌రెడ్డి, మోడంపల్లి, ప్రొద్దుటూరు


బంకర్‌లో గాలివీడు విద్యార్థి

ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు

గాలివీడు, మార్చి 4: గాలివీడుకు చెందిన జబ్బార్‌ సాహెబ్‌ కుమారుడు అహమ్మద్‌ ఉక్రెయిన్‌లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నాడు. తండ్రి కథనం మేరకు..  హమ్మద్‌ 3 సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్‌ కోర్సు చేయడానికి ఉక్రెయిన్‌ వెళాడు. అక్కడ సుమిస్టేట్‌ యూనివర్సిటీలో ఎంబిబిఎస్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా  దాడి చేస్తుండడంతో విద్యార్థులను బంకర్లలో ఉంచారు. ఈ ప్రాంతంలో యుద్ధవాతావరణం లేదు. అయినప్పటికీ అందరూ భయపడుతున్నారు. ఇక్కడి నుంచి   విమానాశ్రయం 1300 కి.మీ. దూరంలో ఉంది. తమ కుమారుడిని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అధికారులు సహకరించాలని అహమ్మద్‌ తండ్రి కోరాడు. విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ శ్రావణి వైద్య విద్యార్థి అహమ్మద్‌ కుటుంబ సభ్యులను కలుసుకుని ధైర్యం చెప్పారు. విద్యార్థితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని తహశీల్దార్‌ పేర్కొన్నారు.




Updated Date - 2022-03-05T05:37:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising