ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

ABN, First Publish Date - 2022-08-12T04:46:04+05:30

విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు.

మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు అందజేస్తున్న కలెక్టర్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా


రాయచోటి (కలెక్టరేట్‌), ఆగస్టు 11: విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు. జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 2022 ఏప్రిల్‌, జూన్‌ త్రైమాసికానికి సంబంధించి 41,255 మంది విద్యార్థులకు గాను అర్హులైన 37,062 మంది తల్లుల ఖాతాల్లో రూ.26.62 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. గురువారం బాపట్ల వేదిక నుంచి జగనన్న విద్యా దీవెన పథకం తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు.  అనంతరం రూ.26.62 కోట్ల రూపాయల మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి జాకీర్‌హుస్సేన్‌, వివిధ సంక్షేమ అధికారులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T04:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising