ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గంధం

ABN, First Publish Date - 2022-04-29T04:47:26+05:30

మండలంలోని పుల్లంపేటలో పుల్లంగేరు నుంచి వచ్చే పంట కాలువ చెత్తా చెదారంతో నిండి దుర్గంధబరితంగా తయారైంది. ఈ పంట కాలువకు ఇరువైపులా గృహాలు నిర్మించుకున్న కొందరు మురుగునీటిని కాలువలోకి వదులుతుండడంతో ఈ కాలువ దుర్గంధం, దుర్వాసనకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎన్నో ఏళ్లుగా ఈ పంట కాలువ అపరిశుభ్రంగా ఉండటంతో కాలువ సమీప ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ కాలువలో నిత్యం పందులు తిరుగుతూ ఉండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

పుల్లంపేటలో మురుగు నీటితో నిండిన పంట కాలువ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏళ్లు గడుస్తున్నా తొలగని మురుగు

పందులు, దోమలకు నిలయంగా పుల్లంపేట పంట కాలువ  

పుల్లంపేట, ఏప్రిల్‌ 28: మండలంలోని పుల్లంపేటలో పుల్లంగేరు నుంచి వచ్చే పంట కాలువ చెత్తా చెదారంతో నిండి దుర్గంధబరితంగా తయారైంది. ఈ పంట కాలువకు ఇరువైపులా గృహాలు నిర్మించుకున్న కొందరు మురుగునీటిని కాలువలోకి వదులుతుండడంతో ఈ కాలువ దుర్గంధం, దుర్వాసనకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎన్నో ఏళ్లుగా ఈ పంట కాలువ అపరిశుభ్రంగా ఉండటంతో కాలువ సమీప ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ కాలువలో నిత్యం పందులు తిరుగుతూ ఉండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఉపాధి హామీ పథకంలో ఎన్నో మార్లు కాలువ పనులు చేపట్టినా మురుగు నీటిని మాత్రం తొలగించడం లేదు. మురుగునీరు కాలువలోకి వదలవద్దని పలుమార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా ఫలితం శూన్యం. గతంలో ఈ ప్రాంతంలో దోమలు ఎక్కువగా ఉండటంతో జ్వరాల బారిన పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పుల్లంపేట మధ్య భాగంలో ఈ కాలువ ఉండటంతో ఈ కాలువలో మురుగు వల్ల దోమలు ఎక్కువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలువ పక్కనే జూనియర్‌ కళాశాల, ప్రాథమికోన్నత పాఠశాల, బస్టాండు ఉన్నాయి. సాయంత్రం అయితే దోమలు ఝుమ్‌.. ఝుమ్‌... అంటూ చెవుల వద్ద మోతలు మోగిస్తుంటాయి. అధికారులు చర్యలు తీసుకుని కాలువలో మురుగు నీరు వదలకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2022-04-29T04:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising