ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి

ABN, First Publish Date - 2022-06-27T05:04:40+05:30

రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలోని హక్కులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చే శారు.

సమావేశంలో మాట్లాడుతున్న తులసిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సదస్సులో అఖిలపక్ష నేతలు

కడప (కలెక్టరేట్‌), జూన్‌ 26 : రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలోని హక్కులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చే శారు. ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్రపతి ఎన్నిక లు, రాష్ట్ర ప్రయోజనాలు అనే అంశంపై పీసీసీ ప్రధాన కార్యద ర్శి ఎస్‌.ఏ.సత్తార్‌ అధ్యక్షతన అఖిలపక్ష నేతలతో చర్చావేదిక జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు చాలా కీలకమన్నారు ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించి రాష్ట్ర విభజన హక్కులు, ఇతర ప్రయోజనాలను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో 11 రాజ్యసభ, 22 మంది ఎంపీలు,  151 ఎమ్యెల్యే సీట్లు ఇచ్చిన ఆంధ్ర  రాష్ట్ర ప్రజల రుణం తీర్చాలని డిమాండ్‌ చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం, సీబీఐ కేసులు, బాబాయి హత్య కేసుల నుంచి ఉపశమనం పొందే లా బీజేపీకి మద్ధతు తెలిపే అవకాశాలున్నాయన్నారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ మతోన్మాద బీజేపీతో చేయి కలిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధానానికి స్వస్తి పలకాలని వైసీపీకి హితవు పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, సీపీఎం నాయకుడు దస్తగిరిరెడ్డి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత శ్రీనివాసులు, లోక్‌సత్తా నేత వేణు, అఖిలపక్ష కన్వీనర్‌ సి.ఆర్‌.వి.ప్రసాదరావు, అలీషేర్‌, దస్తగిరి, డీసీసీ ప్రధాన కార్యదర్శి మైనుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T05:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising