ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News.. నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది: శ్రీనివాసులురెడ్డి

ABN, First Publish Date - 2022-08-22T18:50:06+05:30

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో నిరుద్యోగులు, విద్యార్థులను మోసం చేసిందని శ్రీనివాసులురెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా (Kadapa Dist.): వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) ఏర్పడిన మూడేళ్లలో నిరుద్యోగులు, విద్యార్థులను మోసం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి (Srinivasulu Reddy)ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు (unemployed) నిరాశ, నిస్పృహలతో ఉన్నారన్నారు. వైసీపీ నేతలు (YCP Leaders) ఔట్ సోర్సింగ్ (Out sourcing) ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షలకుపైగా నిరుద్యోగులు ఉన్నారన్నారు. నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఈ నెల 25న అన్ని విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపు పిచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీని ప్రభుత్వం చేపట్టాలని కోరారు. ప్రైవేటు టీచర్లకు టెట్ నిబంధనను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కడప ఉక్కు పరిశ్రమ ఊసే లేదని, తక్షణమే ఉక్కు పరిశ్రమ ప్రభుత్వం నిర్మించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమని విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-08-22T18:50:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising