ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయలసీమ ప్రత్యేక మ్యాప్‌ విడుదల చేయాలి : కుంచం

ABN, First Publish Date - 2022-12-26T23:25:31+05:30

రాయలసీమ ప్రాంతాలన్నీంటినీ కలిపి ప్రత్యేక మ్యాప్‌ను విడుదల చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ పంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 26 : రాయలసీమ ప్రాంతాలన్నీంటినీ కలిపి ప్రత్యేక మ్యాప్‌ను విడుదల చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ పంపారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పటి రాయలసీమ జిల్లాలను పునరేకీకరణ చేస్తూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, క్రిష్ణగిరి, రాయలవేలూరు, బళ్లారి, రాయచూర్‌, కోలార్‌, చిత్రదుర్గ జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు డిమాండుతో ఉద్యమిస్తున్నామన్నారు. రాయలసీమకంటూ ఒక ప్రత్యేక మ్యాప్‌ ఉండాల్సిన అవసరం ఉందని, కేంద్రం స్పందించి మ్యాప్‌ విడుదల చేయాలని కోరుతున్నామన్నారు.

Updated Date - 2022-12-26T23:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising