ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులపై ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2022-05-27T05:13:01+05:30

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నమ య్య జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌రాజు సూచించారు.

రాజంపేట సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర ్ధన్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు


రాయచోటిటౌన్‌, మే 26: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నమ య్య జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌రాజు సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన రాజంపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసు అధికారుల సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ అత్యంత విలువైన ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతినిత్యం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్‌బీడబ్ల్యులను పూర్తి చేయాలన్నారు. అంతేగాక ఎర్రచందనం రవాణా కేసుల్లో  నిందితులుగా ఉండి పరారీలో ఉన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని, పెండింగ్‌ కేసుల్లో త్వరగా చార్జ్‌షీట్‌లను పూర్తి చేసి కోర్టులో దాఖలు చేయాలని ఆయన ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల విషయంలోనూ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్‌ వీబీ రాజ్‌కమల్‌, రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, సీఐలు విశ్వనాథరెడ్డి, పుల్లయ్య, ఎస్‌.వి.నరసింహా రావులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-27T05:13:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising