ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుతడి పంటలు తగ్గుముఖం

ABN, First Publish Date - 2022-04-22T05:28:32+05:30

ఒకప్పుడు మండల వ్యాప్తంగా ఆరుతడి పంటలను రైతులు ఆశాజనకంగా సాగు చేసేవారు. ప్రస్తుతం ఈ సాగు తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. రబీ సీజన్‌ ప్రారంభమైతే చాలు వ్యవసాయ బోరుబావుల కింద నూగులు, ప్రొద్దుతిరుగుడు, సజ్జలు, రాగులు, జొన్నలు వంటి పంటలను సాగు చేసేవారు. ఎక్కడ చూసినా వందల ఎకరాల్లో పంటలతో కళకళలాడుతూ కనిపించేవి.

సాగులో ఉన్న ప్రొద్దుతిరుగుడు పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగుకు దూరమవుతున్న రైతులు

సంబేపల్లె, ఏప్రిల్‌ 21: ఒకప్పుడు మండల వ్యాప్తంగా ఆరుతడి పంటలను రైతులు ఆశాజనకంగా సాగు చేసేవారు. ప్రస్తుతం ఈ సాగు తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. రబీ సీజన్‌ ప్రారంభమైతే చాలు వ్యవసాయ బోరుబావుల కింద నూగులు, ప్రొద్దుతిరుగుడు, సజ్జలు, రాగులు, జొన్నలు వంటి పంటలను సాగు చేసేవారు.  ఎక్కడ చూసినా వందల ఎకరాల్లో పంటలతో కళకళలాడుతూ కనిపించేవి. ప్రస్తుతం ఆరుతడి పంట సాగు గణనీయంగా తగ్గాయి. మండల వ్యాప్తంగా ఒక ఎకరా పొలంలో మాత్రమే నువ్వుల పంట సాగు చేశారు. మార్కెట్‌లో నువ్వులకు మంచి గిరాకీ ఉంది. ఒక క్వింటా రూ.8 నుంచి 10 వేలు ఉంది. రైతులు ప్రధానంగా వేరుశనగ విత్తన సాగుపై మక్కువ చూపడంతో బోరుబావుల కింద వేరుశనగ సాగు గణనీయంగా పెరిగింది. మండల వ్యాప్తంగా ప్రొద్దుతిరుగుడు 30 ఎకరాల్లో సాగు చేశారు. ఒకప్పుడు ప్రధాన పంటగా ప్రొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు ఇప్పుడు ఆ పంట సాగుపై మక్కువ చూపలేదని అర్థమవుతోంది. పాల గింజ పుట్టినప్పటి నుంచి గువ్వల బెడద ఎక్కువ కావడంతో రైతులు పంట సాగుకు దూరమవుతున్నారు. 



Updated Date - 2022-04-22T05:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising