ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా సీతారాముల కల్యాణం

ABN, First Publish Date - 2022-10-18T04:34:28+05:30

వాల్మీకిపురం పట్టణంలోని పట్టాభిరామాలయంలో సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీరామచంద్రుడి జన్మనక్షత్రమైన పునర్వసును పురస్కరించుకుని సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.

సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకిపురం, అక్టోబరు 17: వాల్మీకిపురం పట్టణంలోని పట్టాభిరామాలయంలో సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీరామచంద్రుడి జన్మనక్షత్రమైన పునర్వసును పురస్కరించుకుని సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, మూలవర్లకు అభిషేకం, అర్చన, తోమాలసేవలతో ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించారు. అనంతరం భోగోత్సవ మూర్తులైన సీతారాములను నూతన వధూవరులుగా అలంకరించి ఆలయ మండలంలోని కల్యాణ వేదికపై ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, విశేష భక్తజనం నడుమ సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. చివరగా హోమాది కార్యక్రమాలు నిర్వహించి కల్యాణంలో పాల్గొన్న దంపతులకు, భక్తులకు టీటీడీ తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు కృష్ణమూర్తి, దిశంత్‌కుమార్‌, అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, భక్తులు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T04:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising