ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దేశ్వరం అలుగు తోనే సాగు వెలుగులు

ABN, First Publish Date - 2022-05-25T04:57:47+05:30

రాయలసీమ బీడు భూముల్లో సాగువెలుగు ల కోసం సిద్దేశ్వరం అలు గు సాధించుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షు డు బొజ్జా దశరధరామిరెడ్డి పిలుపునిచ్చారు.

సిద్దేశ్వరం అలుగు సాధన కోసం చేపడుతున్న జలదీక్ష పోస్టర్లు ఆవిష్కరిస్తున్న బొజ్జా దశరధరామిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలదీక్షపై కిసాన్‌సంఘ్‌ రైతు సదస్సు : బొజ్జా దశరధరామిరెడ్డి

ప్రొద్దుటూరు అర్బన్‌ మే 24: రాయలసీమ బీడు భూముల్లో సాగువెలుగు ల కోసం సిద్దేశ్వరం అలు గు సాధించుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షు డు బొజ్జా దశరధరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వెల్లాలలో సిద్దేశ్వరం అలుగు సాధనకోసం జరిగే జలదీక్షపై భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యం లో రైతులతో సదస్సు నిర్వహించింది. ఈసదస్సులో మే 31న సిద్దేశ్వరం వద్ద జరిగే జలదీక్ష పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ రాయలసీమకు సాగు, తాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

50 ఏళ్లగా సీమ ప్రజానీకపు సమస్యలను గుర్తించని ప్రభుత్వాలపై ఒత్తిడితేలేని పార్టీల వైఖరిని ఆయన ఎండగట్టారు. రాజకీయ పార్టీలు అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయేతప్ప చిత్తశుద్దితో సీమకు నిఖరజలాలు అందించే సిద్దేశ్వరం విషయంలో కృషి చేయడంలేదన్నారు. సీమ ప్రాజెక్టులు అనుమతులులేని ప్రాజెక్టులుగా కెఆర్‌ఎంబీ బోర్డు ప్రకటిస్తే ప్రభుత్వం గానీ ప్రతిపక్షపార్టీలు గానీ దానిపై తీవ్రంగా స్పందించి పోరాడలేదన్నారు. అందుకే రాయలసీమ ప్రజలు రైతాంగం లో సిద్దేశ్వరం అలుగుపై అవగాహన కల్పించేందుకు సీమలోని గ్రామాలు పర్యటిస్తున్నామన్నారు. మే 31 సిద్వేశ్వరం వద్ద జరిగే జలదీక్షను విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కిసాన్‌సంఘ్‌ నేతలు వెంకటరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T04:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising