ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లెక్సీలు చించివేయడం అప్రజాస్వామ్యం

ABN, First Publish Date - 2022-01-17T04:34:18+05:30

వేంపల్లెలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివే యడం అప్రజా స్వామ్యమని మైనా ర్టీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ షబ్బీర్‌ పేర్కొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు షబ్బీర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, జనవరి 16: వేంపల్లెలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివే యడం అప్రజా స్వామ్యమని మైనా ర్టీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ షబ్బీర్‌ పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ పార్ల మెంటరీ అధ్యక్షుడు జగన్నాథరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్లు బాల స్వామిరెడ్డి, మునిరెడ్డితో కలిసి విలేక రులతో మాట్లాడారు. నాలుగు రోడ్ల కూడలి, ఎన్టీఆర్‌ సర్కిల్‌లో టీడీపీ హయాంలో నిత్యావసర ధరలు, వైసీపీ హయాంలో ధరల పట్టికతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అర్దరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడం శోచనీయమన్నారు.

30 ఏళ్లగా ఎవరు ఫ్లెక్సీలు వేసుకున్నా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, వైసీపీ పాలన లో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు జరగడం మంచి సాంప్రదాయం కాదన్నారు. టీడీపీ నేతలు ఆర్వీ రమేష్‌, దేవస్థాన మాజీ సభ్యులు తిప్పారెడ్డి, గోటూరు నాగభూషణం, రైతు విభాగ జిల్లా కార్యవర్గ సభ్యులు కుమ్మరాంపల్లె భాస్కర్‌రెడ్డి, పొట్టిపాటి మోహన్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, పివి రమణ, మహేష్‌బాబులు పాల్గొన్నారు. 

అనుమతి తప్పనిసరి 

 పంచాయతీల్లో ఫ్లెక్సీల ఏర్పాటుకు పంచాయతీ అనుమతి తప్పనిసరి అని మండల అభివృద్ధి అధికారి మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోదలచిన వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులు ఇస్తామన్నారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-01-17T04:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising