ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి

ABN, First Publish Date - 2022-05-21T04:42:04+05:30

ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్త వేరు చేసి రిక్షాలో వేసి చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నమయ్య కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నమండెం, మే20: ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్త వేరు చేసి రిక్షాలో వేసి చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నమయ్య కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా పేర్కొన్నారు. శుక్రవారం జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలు చేస్తోందన్నారు. కార్యక్ర మంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాన్ని, మన ప్రాంతాన్ని చెత్తరహిత ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. 

పంచాయతీ చెత్త రిక్షాలు రోజు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలన్నారు. తిరుపతి పట్టణంలో రోజు 60 నుంచి 70 టన్నుల వరకు చెత్తసేకరిస్తున్నారని, దీంతో తిరుపతి మున్సిపాలిటీకి రోజుకు దాదాపు లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తోందన్నారు. కార్యక్రమానికి ముందు కలెక్టర్‌ చిన్నమండెం పంచాయతీలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రా న్ని పరిశీలించారు. పంచాయతీ సెక్రటరీ ద్వారా వివరాలు తెలుసుకు న్నారు. డీపీఓ నాగరాజు, మండల ఉపాధ్యక్షుడు అలీఖాన్‌, సర్పంచ్‌ అమీరాబీ, రెవెన్యూ, ఎంపీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T04:42:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising