వంకలో చిక్కుకున్న గొర్రెల కాపరులు
ABN, First Publish Date - 2022-08-05T04:53:58+05:30
ఓబుళరెడ్డిపల్లె సమీప వంక వరద ఉధృతికి బుధవారం ఇద్దరు గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. వివరాలిలా ఉన్నాయి.
ఇద్దరి ప్రాణాలను కాపాడిన పోలీసులు
వీరపునాయునిపల్లె, ఆగస్టు 4: ఓబుళరెడ్డిపల్లె సమీప వంక వరద ఉధృతికి బుధవారం ఇద్దరు గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం గొర్రెల మేతకు బాలమునీంద్ర యాదవ్, ఆవుల ఎర్రన్న వెళ్లారు. వంక దాటుతుండగా ఒక్కసారిగా వరద ఉన్నట్లుండి పెరిగిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఓ చెట్టును పట్టుకుని ఉండిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి, ఫైర్, రెవెన్యూ సిబ్బంది చేరుకున్నారు.
దాదాపు రెండు గంటల పాటు శ్రమించి రబ్బర్ బోటు, లైఫ్ జాకెట్లు, రోప్ సహాయంతో బాల మునీంద్రయాదవ్ ఆవుల ఎర్రన్నను ఒడ్డుకు చేర్చా రు. ఈ సందర్భంగా ప్రాణాలు ఫణంగా పెట్టి కాపాడిన డీఎసీ ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల రూరల్ సీఐ రవీంద్రనాథ్‌రెడ్డి, వీఎన్‌పల్లె ఎస్‌ఐ రాజారమేష్, వేంపల్లె, ప్రొద్దుటూరుకు చెందిన అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అభినందించారు.
Updated Date - 2022-08-05T04:53:58+05:30 IST