ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ అభివృద్ధి శిథిలాలకు ఏడేళ్లు..

ABN, First Publish Date - 2022-08-09T05:02:08+05:30

వాల్మీకిపురం పట్టణానికి సమీపంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధు లు వృథాగా భవనాల పాలయ్యాయి. మదనపల్లెకు వెళ్లే మార్గంలో నూతన సబ్‌జైలు, మోడరన్‌ ఫైర్‌స్టేషన్‌ నూతన భవనాల నిర్మాణాలు చేప ట్టి నేటికీ దాదాపుగా ఏడేళ్లు కావస్తున్నా అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా ఈ రెండు భవనాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు.

శిథిలాలను తలపిస్తున్న నూతన సబ్‌జైలు భవనాలు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట్లాది ప్రభుత్వ నిధులు వృథా   

మందుబాబుల అడ్డాగా ఫైర్‌స్టేషన్‌    

ఇరుకు గదుల్లో అల్లాడుతున్న సిబ్బంది


వాల్మీకిపురం, ఆగస్టు 8: వాల్మీకిపురం పట్టణానికి సమీపంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధు లు వృథాగా భవనాల పాలయ్యాయి. మదనపల్లెకు వెళ్లే మార్గంలో నూతన సబ్‌జైలు, మోడరన్‌ ఫైర్‌స్టేషన్‌ నూతన భవనాల నిర్మాణాలు చేప ట్టి నేటికీ దాదాపుగా ఏడేళ్లు కావస్తున్నా అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా ఈ రెండు భవనాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. అప్పటి నుం చి పనులు మాత్రం పూర్తి కాలేదు. దాదాపు రూ.3 కోట్లతో సబ్‌జైలు నిర్మాణం చేపట్టి అత్యాధునిక ప్రమాణాలతో 80 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు. సబ్‌జైలులో పురుషులకు, మహిళలకు ప్రత్యేక బ్యారక్‌లు, అత్యాధునిక ప్రమాణాలతో పనులు పూర్తి చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం. సబ్‌జైలు భవనాలలో పాములు, జంతువులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. అలాగే అదే ప్రాంతంలో నిర్మాణం చేపట్టిన మోడరన్‌ అగ్నిమాపక కేంద్రం నూతన భవనాల తీరు కూడా అలాగే మారింది. కోటి పది లక్షలతో నిర్మాణ పనులు చేపట్టి గాలికి వదిలేశారు. ఈ భవనాలు మందుబాబులకు అడ్డాగా, గొర్రెల ఆవాసాలకు కేంద్రంగా మారాయి. 2019వ సంవత్సరంలో రెండో విడతగా రూ.18 లక్షలు నిధులు మంజూరైనప్పటికీ పనులు మాత్రం పూర్తి చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం స్థానిక బైపాస్‌ రోడ్డులో ఓ ఇరుకు గదుల్లో అగ్నిమాపక కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. 12 మందికి పైగా సిబ్బంది పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభానికి నోచుకునేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రజలు కోరుతున్నారు. 



Updated Date - 2022-08-09T05:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising