ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలే

ABN, First Publish Date - 2022-10-08T04:46:39+05:30

మాండవ్యనదిలో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలకు వెనకాడబో మని ప్రజలు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఎదు ట వాపోయారు. శుక్రవారం ఎమ్మెల్యే మేడా స్వ గృ హానికి వీరబల్లి మండల పరిధిలోని పాపిరెడ్డిపల్లె, తాటికుంటపల్లె రెడ్డివారిపల్లె హరిజనవాడ గ్రామ ప్రజలు సుమారు 300మంది వచ్చారు.

ఇసుక రీచ్‌లను ఆపివేయాలంటూ ఎమ్మెల్యే మేడాకు విన్నవిస్తున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు గ్రామాల్లో తాగు, సాగునీటికి ఇబ్బందులు 

వెంటనే ఆపాలంటూ ఎమ్మెల్యేకు వందలాది మంది ఏకరువు 

రాజంపేట, అక్టోబరు 7: మాండవ్యనదిలో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలకు వెనకాడబో మని ప్రజలు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఎదు ట వాపోయారు. శుక్రవారం ఎమ్మెల్యే మేడా స్వ గృ హానికి వీరబల్లి మండల పరిధిలోని పాపిరెడ్డిపల్లె, తాటికుంటపల్లె రెడ్డివారిపల్లె హరిజనవాడ గ్రామ ప్రజలు సుమారు 300మంది వచ్చారు. వారు మా ట్లాడుతూ.. తమ గ్రామాల పరిధిలో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారని, దీని వల్ల తాగు, సాగునీటికి కరవుతో అల్లాడాల్సి వస్తుం దని ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుమా రు మూడు గ్రామాల పేదలు ఈ నది ఆధారంగానే జీవిస్తున్నారని, ఈ నది ఆధారంగా సుమారు 50 బోర్ల ద్వారా సాగునీరు అందుతూ పంటలు పం డుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో అధికారులు ఇసుక రీచ్‌ను మంజూరు చేస్తే భూ గర్భజలాలు అడుగంటి చుక్కనీరు లేకుండా పోతుం దన్నారు. వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి ఈ ఇసుక రీచ్‌ను రద్దు చేయించాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కాగా.. గ్రామ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-10-08T04:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising